• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • URVASHI RAUTELA LATEST DANCE VIDEO GO VIRAL ON SOCIAL MEDIA TA

Urvashi Rautela: వెరైటీ డాన్స్‌ మూమెంట్స్‌తో అదరగొట్టిన ఊర్వశి రౌతెెలా..

Urvashi Rautela: వెరైటీ డాన్స్‌ మూమెంట్స్‌తో అదరగొట్టిన ఊర్వశి రౌతెెలా..

ఊర్వశి రౌతెలా (Instagram/Photo)

Urvashi Rautela : ఊర్వశి రౌటేలా 2013లో సన్ని దేవోల్  హీరోగా నటించిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘భాగ్ జానీ’ సినిమాలో నటించింది. తాజాగా ఈ భామ చేసిన డాన్స్ మూమెంట్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

  • Share this:
    Urvashi Rautela : ఊర్వశి రౌటేలా 2013లో సన్ని దేవోల్  హీరోగా నటించిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘భాగ్ జానీ’ సినిమాలో నటించింది. ఈ మధ్యలో కన్నడలో దర్శన్ హీరోగా నటించిన ‘మిస్టర్ ఐరావతా’ సినిమాలో నటించింది. ఐనా.. ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఆ తర్వాత ‘సనమ్ రే’,
    'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో గ్లామర్ పాత్రలతో అలరించింది. ఎన్ని సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు ఈ భామకు. దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఈ భామ 2015లో మిస్ దివ కిరీటాన్ని అందుకుని.. అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. తాజాగా ఈ భామ.. తెలుగులో సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘బ్లాక్ రోజ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.



    ఈ సంగతి పక్కనపెడితే.. ఎప్పటి కప్పడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియోలో పోస్ట్ చేసే ఊర్వశి రౌతెలా .. తాజాగా నేల పై పడుకొని చేసిన డాన్స్ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఒక పాటకు సంబంధించిన రిహార్సల్స్ చేస్తున్నట్టు ఉంది. ఏమైనా ఊర్వశి రిహార్సల్స్‌లో భాగంగా చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కింద పడుకొని.. కాళ్లను అటూ ఇటూ కదుపుతున్న చేసిన మూమెంట్స్ చూసి ఊర్వశి అభిమానులు ఫిదా అవుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: