Urvashi Rautela : హాట్ భామ ఊర్వశిని టార్గెట్ చేసిన హ్యాకర్స్..

ఊర్వశి రౌటేలా Photo : Instagram

Urvashi Rautela : ఊర్వశి రౌటేలా 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    Urvashi Rautela : ఊర్వశి రౌటేలా 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు ఈ భామకు. దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఈ భామ 2015లో మిస్ దివ కిరీటాన్ని అందుకుని.. అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. అది అలా ఉంటే ఇటీవలి కాలంలో సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ కావడం చాలా కామన్‌గా మారింది. తాజాగా ఊర్వశీ రౌతేలా ఫేస్ బుక్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందట. దీంతో తన ఫేస్ బుక్ ద్వారా వచ్చే ఈ పోస్ట్ కి రియాక్ట్ కావద్దని ట్విట్టర్ ద్వారా నెటిజన్లను విజ్ఞప్తి చేసింది ఊర్వశి. అంతేకాదు తన అకౌంట్ సేఫ్‌గా తనకు దక్కాలంటే హ్యాకర్స్ తనని భారీ మొత్తంలో డబ్బు అడుగుతున్నారని ఊర్వశీ ట్వీట్ చేసింది. ఈ విషయం పై పోలీసులను కూడా ఊర్వశి ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇక ఊర్వశి తెలుగులో కూడా కొన్ని అవకాశాలు దక్కించుకున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ సుకుమార్ పుష్పలో ఓ ఐటెమ్ సాంగ్‌లో ఈ భామ మెరవనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గోపీచంద్ సరసన ఓ కొత్త సినిమాకు ఈ భామను పరిశీలిస్తున్నట్లు సమాచారం.


    Published by:Suresh Rachamalla
    First published: