దొంగ పని చేసి.. దొరికిపోయిన హీరోయిన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..

ప్రతీకాత్మక చిత్రం

Urvashi Rautela : హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా.

  • Share this:
    Urvashi Rautela : హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా. ఇప్పటికే అక్కడ 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు. అయితే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఓ దొంగతనం చేస్తూ దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఊర్వశి ఇటీవల ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న కొరియన్ మూవీ ‘పారాసైట్‌’పై తన అభిప్రాయాల్ని తెలియజేస్తూ తాజాగా ఓ పోస్ట్‌ చేసింది. అందులో భాగంగా ‘‘పారాసైట్’ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఇదేనంటూ ఆమె చేసిన ట్వీట్‌ ప్రస్తుతం విమర్శలపాలౌతుంది. దీనికి కారణం ఏమంటే.. న్యూయార్క్‌కు చెంది ప్రముఖ రచయిత జేపీ బ్రామర్‌ ‘పారాసైట్‌’ సినిమాను ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌ను ఊర్వశి కొద్దిగా కూడా మార్చకుండా కాపీ చేసి.. తన ట్విట్టర్ హ్యండిల్‌పై పేస్ట్‌ చేసి పోస్ట్ చేసింది.

    Urvashi Rautela copies New York writers Parasite review, Urvashi rautela hot,Urvashi rautela,Urvashi rautela twitter,Urvashi rautela facebook,Urvashi rautela insta,Urvashi rautela instagram,Urvashi rautela hot,urvashi rautela,urvashi rautela hot,urvashi rautela songs,urvashi rautela bikini,urvashi rautela dance,urvashi rautela movies,urvashi rautela photoshoot,urvashi rautela boney kapoor,urvashi rautela hot photos,urvashi rautela photoshoot,urvashi rautela dance,urvashi rautela biography,urvashi rautela photos,urvashi rautela movies,urvashi rautela hot edit,urvashi rautela latest,urvashi rautela hot scene,urvashi rautela hot item song,ఊర్వశి రౌటేలా,ఊర్వశి రౌటేలా హాట్,ఊర్వశి రౌటేలా హాట్ ఫోటోస్,ఊర్వశి రౌటేలా
    ఊర్వశి రౌటేలా Photo : Instagram


    ఊర్వశి వాల్‌పై ఉన్న ఈ కాపీ పేస్ట్ ట్వీట్‌ను చూసిన జేపీ ఊర్వశి చేసిన పనిపై స్పందిస్తూ.. ‘ఊర్వశి రౌటేలా కనీసం నా ట్వీట్‌లోని తప్పుల్ని కూడా సరిచేయలేదు. గ్రామర్‌ మిస్టెక్స్‌ను కూడా అలానే కాపీ చేసి పేస్ట్‌ చేసేసిందంటూ చురకలంటిచాడు. ఇక ఇదంత చూసిన నెటిజన్స్ ఊర్వశి తీరుపై మండిపడుతున్నారు. రకరకాల కామెంట్స్ పెడుతూ ‘దొంగ, సొంతంగా రాయలేవా ? కాపీ.. పేస్ట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నవా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఊర్వశి గతంలో కూడా ఓ సారి ఇలాంటే పని చేసిన సంగతి తెలిసిందే. నటి షబానా అజ్మీ కారు యాక్సిడెంట్‌కు గురైన సమయంలో ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను కాపీ చేసి.. తన వాల్‌పై పేస్ట్‌ చేసింది. మరో సందర్భంలో పాపులర్ అమెరికన్ మోడల్‌ గిగి హడిడ్‌ పోస్ట్‌ను కూడా కాపీ చేసి దొరికిపోయింది. ఇలా ఊర్వశి వేరేవాళ్ల ట్వీట్స్‌ను దొంగతనం చేయడం.. దొరికిపోవడంతో ఆమెను నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం ఊర్వశి 'వర్జిన్ భానుప్రియ' అనే సినిమాలో నటిస్తోంది.










    Published by:Suresh Rachamalla
    First published: