• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • URVASHI RAUTELA CLARITY ABOUT BONEY KAPOOR ISSUE SHE SAY BONEY IS INNOCENT TA

Boney Kapoor: బోనీ కపూర్ అసభ్య ప్రవర్తన.. క్లారిటీ ఇచ్చిన ఊర్వశి రౌతెలా..

Boney Kapoor: బోనీ కపూర్ అసభ్య ప్రవర్తన.. క్లారిటీ ఇచ్చిన ఊర్వశి రౌతెలా..

బోనీ కపూర్,ఊర్వశి రౌతెలా (News18/Gujarath)

Boney kapoor: సాధారణంగా ఏ మనిషికైనా కొన్ని అనుకోని పరిస్థితులు లేనిపోని తలనొప్పులు తెస్తుంటాయి. సెలెబ్రిటీలు, హీరోయిన్లకైతే ఇది మరీ ఎక్కవ. కొన్నినెలల క్రితం బోనీ కపూర్ అనుకోకుండా ఊర్వశి రౌతెలా విషయంలో చిక్కుల్లో పడ్డాడు.

  • Share this:
    సాధారణంగా ఏ మనిషికైనా కొన్ని అనుకోని పరిస్థితులు లేనిపోని తలనొప్పులు తెస్తుంటాయి. సెలెబ్రిటీలు, హీరోయిన్లకైతే ఇది మరీ ఎక్కవ. ప్రతీ క్షణం వారి వారి కదలికలను పరిశీలించేందకు  మీడియా, దానికి తోడు సోషల్ మీడియా అదును దొరికితే చాలు బుక్ చేసేస్తుంటాయి. కాబట్టి నెటిజన్లతో, మీడియాతో సెలెబ్రిటీలు చాలా జాగ్రత్తగా మసలుకుంటారు. కానీ ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో అనుకున్నవి సాధ్యపడకపోవచ్చు. అయితే కొన్ని నెలల క్రితం జరిగిన ఈ సంఘటన ప్రముఖ సీనియర్  నిర్మాత బోనీ కపూర్‌ని అబాసు పాలు చేసింది. అప్పుడు బోనీ కపూర్.. సినిమావాళ్లకు సంబంధించిన ఓ ఫంక్షన్‌‌కి హాజరయ్యారు. ఈ వేడుకకు బాలీవుడ్‌కి చెందిన ఊర్వశి రౌతాలతో పాటు  వేరే హీరోయిన్లు కూడా వచ్చారు. ఆ సమయంలో బోనీ కపూర్ ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తుండగా.. ఊర్వశి రౌతేలా కూడా వచ్చింది. దీంతో ఆమెను దగ్గరగా రండి అంటూ ఫ్రెండ్లీగా టచ్ చేశారు బోనీ కపూర్ అపుడే కెమెరా క్లిక్ అనిపించాయి.

    urvashi rautela clarity about boney kapoor issue.. she say boney is innocent,boney kapoor,urvashi rautela boney kapoor,urvashi rautela,boney kapoor twitter,boney kapoor instagram,boney kapoor urvashi rautela,urvashi rautela instagram,urvashi rautela twitter,boney kapoor touches urvashi rautela,boney kapoor and urvashi rautela,boney kapoor with urvashi rautela,boney kapoor spanks urvashi rautela,boney kapoor viral video,urvashi rautela boney kapoor viral video,urvashi rautela boney kapoor video,urvashi rautela and boney kapoor,urvashi rautela with boney kapoor,bollywood,hindi cinema,బోనీ కపూర్,ఊర్వశి రౌతెలా,ఊర్వశి రౌతెలా తో బోనీకపూర్ అసభ్య ప్రవర్తన,బోనీ కపూర్,ఊర్వవి రౌతెలా,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,
    ఊర్వశి రౌతెలాతో బోనీ కపూర్ (


    సో ఒకే ఫ్రేమ్‌లో అందరూ కనిపించాలని భావించిన బోనీ కపూర్, ఊర్వశి రౌతాలాను దగ్గరగా రమ్మనే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఆమెపై చేయి వేశారు బోనీ. అయితే ఈ ఫొటోల్లో బోనీ కపూర్, ఊర్వశి నడుం పట్టుకున్నట్లుగా కనిపించింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలు, వీడియోలు చూసి ఓ ఆంగ్ల మీడియా సంస్థ ఆ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ఊర్వశి రౌతాలాతో బోనీ కపూర్ అసభ్య ప్రవర్తన. పబ్లిక్‌గానే ఆమె నడుంపై చేయి వేశాడంటూ ప్రచారం చేశారు. ఇది గమనించిన ఊర్వశి రౌతాలా వెంటనే అప్రమత్తమై ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చేసింది. ఆ సమయంలో బోనీ కపూర్ తనతో అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పింది. అసలు బోనీ కపూర్ నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు. బోనీ సర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. దయచేసి ఇలాంటివి నమ్మకండి.. అని తెలిపింది ఊర్వశి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు