
ఊర్మిళా మటోండ్కర్
రామ్ గోపాల్ వర్మ తీసిన రంగీలా సినిమా ఊర్మిళను ఓ స్టార్ హీరోయిన్గా మార్చేసింది.
బాలీవుడ్ హీరోయిన్, రంగీలా అంటూ దేశం మొత్తాన్ని ఊపేసిన ఊర్మిళా మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆమె ఎక్కడి నుంచి పోటీచేస్తారనే అంశంపై ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీజేపీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయాలకు సినీ గ్లామర్ అద్దేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే ఊర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, ఊర్మిళతో సూపర్ హిట్ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ.. ఆమె రాజకీయ ఆరంగేట్రంపై తనదైన స్టైల్లో స్పందించారు. ‘ఊర్మిళా.. నీ కొత్త ప్రయాణం గురించి తెలుసుకుని నేను థ్రిల్ అయ్యా. మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, మోస్ట్ బ్యూటిఫుల్ పొలిటీషియన్‌గా మారుతోంది. ఆయిరే.. ఆయిరే.. జోర్ లగాకే ఆయిరే..’ అంటూ ట్వీట్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ తీసిన రంగీలా సినిమా ఊర్మిళను ఓ స్టార్ హీరోయిన్గా మార్చేసింది. రంగీలా కంటే ముందు అంతం, ద్రోహి, గాయం లాంటి తెలుగు సినిమాల్లో నటించింది. కానీ, రంగీలా సినిమా ఓ రేంజ్లో క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత దౌడ్, సత్య, కౌన్, మస్త్, జంగల్, కంపెనీ, భూత్, ఆగ్ సినిమాల్లో ఆర్జీవీ డైరెక్షన్లో యాక్ట్ చేసింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:March 27, 2019, 18:50 IST