బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ మరోసారి ట్రోలింగ్‌కు గురైంది. ఈ సారి ఆమె చేసిన పనిని నెటిజన్లు తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. పండగ పూట ఇలాంటి అవతారం ఏంటి తల్లి అంటూ.... మండిపడుతున్నారు. దీంతో మరోసారి ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. దివాళి సందర్భంగా బాలీవుడ్ నటీనటులంతా... సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో అంతా ఫెస్టివల్ డ్రెస్సుల్లో మెరిశారు, పలువురు హీరోయిన్లు ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించి ఫోటో షూట్లు చేశారు.
అయితే తాజాగా ఉర్పీ దివాళి సందర్భంగా చేసిన పని మాత్రం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇంటర్నెట్ సంచలనంగా మారిన ఉర్ఫీ జావేద్ ఈసారి దీపావళికి సెమీ న్యూడ్ వీడియోను పోస్టు చేసింది. టాప్ లెస్‌గా కనిపించి అందరికి షాక్ ఇచ్చంది. ఉర్ఫీ టాప్‌లెస్‌గా ఉండి.. పొడవాటి స్కర్ట్ మాత్రమే ధరించింది. ఒక చేత్తో తన ఛాతీని కప్పుకొని మరో... చెత్తో లడ్డూ తింటూ... వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో ఆమె ముందు పలు దీపాలు కూడా ఉన్నాయి.
ఉర్ఫీ తన పొడవాటి ఎర్రటి స్కర్ట్‌తో సరిపోయే చెవిపోగులు ధరించి, ఆమె జుట్టును లూజ్‌గా వదిలేసింది .ఈ వీడియోకు దీపావళి ప్రకంపనలు ఇవ్వడానికి, నటి ముందు మట్టి దీపం వెలిగించబడింది మరియు నటి ఉర్ఫీ జావేద్ క్రిమ్సన్ సోఫాపై పడుకుని పోజులిచ్చింది. ఇప్పుడు ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. పండగ పూట అయిన కనీసం పద్దతైన డ్రెస్సులు వేసుకోవచ్చు కదా అంటూ తిట్టిపోస్తున్నారు.
మరి టాప్ లెస్‌గా దివాళి విషెస్ చెప్పాల్సిన అవసరం ఏముందని మరో నెటిజన్ ఉర్ఫీని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం ఆమె చేసిన వీడియోకు దారుణమైన కామంట్లు పెడుతున్నారు. ఆమె పోస్ట్ ఇప్పుడు ట్రోల్ చేయబడింది. ఒక వ్యక్తి "వెళ్ళిపోయాను" అని రాశాడు. మరొకరు "అరీ దీదీ దీపావళి పే తో కుచ్ అచా స క్రో" అని రాశారు.
ఉర్ఫీ జావేద్ ఇటీవలే ఓ షూటింగులో కింద పడిన విషయం తెలిసిందే. ఎరుపు రంగు చీర కట్టుకుని హాట్ లుక్‌లో కనిపించి కుర్రాళ్ల నిద్రను దోచింది. హాఫ్ చీర కట్టుకున్న ఉర్ఫీ జావేద్ స్వింగ్ పట్టుకుని జాలీగా డ్యాన్స్ చేసింది. గాలి బలంగా వీచింది. ఒక్కసారిగా నటి జారిపడటంతో యువకులంతా పరుగున వచ్చి ఆమెను పట్టుకున్నారు.ఈ వీడియో కూడా నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Bollywood news