Uppena: ఆ ట్రోలింగ్‌లు ఉప్పెన‌కు మైన‌స్‌గా మార‌నున్నాయా..?

వైష్ణవ్ తేజ్: ఉప్పెన: విడుదల ఫిబ్రవరి 12

Uppena: ఈ నెల‌లో టాలీవుడ్‌లో విడుద‌ల‌వుతోన్న క్రేజీ చిత్రాల్లో ఉప్పెన ఒక‌టి. వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టిలు హీరో హీరోయిన్లుగా.. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం ఇది. సెట్స్ మీద‌కు వెళ్లిన‌ప్ప‌టి నుంచే ఈ మూవీ మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది.

  • Share this:
    Uppena: ఈ నెల‌లో టాలీవుడ్‌లో విడుద‌ల‌వుతోన్న క్రేజీ చిత్రాల్లో ఉప్పెన ఒక‌టి. వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టిలు హీరో హీరోయిన్లుగా.. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం ఇది. సెట్స్ మీద‌కు వెళ్లిన‌ప్ప‌టి నుంచే ఈ మూవీ మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. ఆ త‌రువాత ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్ ఇలా అన్నీ ఆక‌ట్టుకుంటూ రావ‌డంతో ఇప్పుడు ఈ మూవీపై అంచ‌నాలు పెరిగిపోయాయి. మెగాభిమానులే కాదు ఈ మూవీ కోసం సాధార‌ణ ప్రేక్ష‌కులు సైతం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్ కంటే ముందే షూటింగ్‌ని పూర్తి చేసుకున్న‌ప్ప‌టికీ.. ఈ మూవీ క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో ఓటీటీలో విడుద‌ల చేయ‌కుండా.. థియేట‌ర్లు తెరుచుకునే వర‌కు ఎదురుచూశారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఇక మ‌రో ఏడు రోజుల్లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది.

    ఈ క్ర‌మంలో గురువారం ఈ మూవీ నుంచి ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసి.. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ ట్రైల‌ర్ అంద‌రినీ తెగ ఆక‌ట్టుకోవ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తోంది. కాగా అంతా బాగానే ఉంది కానీ.. ఈ ట్రైల‌ర్‌లో ఒక్క విష‌యం నెగిటివ్‌గా మారింది. అదేంటంటే.. విజ‌య్ సేతుప‌తి డ‌బ్బింగ్. చిరంజీవి సైరా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విజ‌య్ సేతుప‌తి.. ఉప్పెనలో విల‌న్ రాయ‌ణం పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ట్రైల‌ర్‌లో ఆయ‌న విల‌నిజం బాగా ఆక‌ట్టుకుంది కానీ ఆయ‌న పాత్ర‌కు చెప్పిన డ‌బ్బింగ్ స‌రిగా లేదు.

    దీనిపై ట్రోల్స్ ప్రారంభం అయ్యాయి. విజ‌య్ సేతుప‌తితోనే ఆ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పించి ఉండాల్సింది అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్తి అయ్యాయి. సెన్సార్ స‌ర్టిఫికేట్ కూడా వ‌చ్చేసింది. ఇలాంటి స‌మ‌యంలో విజ‌య్ సేతుప‌తి పాత్ర‌కు మ‌రొక‌రితో డ‌బ్బింగ్ చెప్పించ‌డం క‌ష్టం. దీంతో ఈ మూవీకి ఇది మైన‌స్‌గా మారుతుందేమోన‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ట్రైల‌ర్‌లో అలా అనిపించినా.. సినిమా చూసే స‌మ‌యంలో ఆ వాయిస్ అల‌వాటు అవుతుంద‌ని.. అప్పుడు ప్రేక్ష‌కులు ఈ నెగిటివ్‌ని ప‌ట్టించుకోక‌పోవ‌చ్చున‌ని కొంత‌మంది కామెంట్లు పెడుతున్నారు.


    దానికి తోడు ఈ మూవీ క్లైమాక్స్‌లో హీరోను న‌పుంస‌కుడిని చేస్తార‌నే టాక్ కూడా న‌డుస్తోంది. మ‌రి ఎన్నో అంచ‌నాల మ‌ధ్య‌న రాబోతున్న ఈ మూవీ ఎలా ఉండ‌బోతోంది..? అన్న‌ది తెలియాలంటే మ‌రో వారం ఆగాల్సిందే. కాగా మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన విష‌యం తెలిసిందే.
    Published by:Manjula S
    First published: