Uppena Movie Twitter Review: ’ఉప్పెన’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఇంతకీ ఎలా ఉందంటే..

’ఉప్పెన’ మూవీ ట్విట్టర్ రివ్యూ (Twitter/Photo)

Uppena Movie Twitter Review: తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘ఉప్పెన’ ఒకటి. ఈ రోజు థియేటర్స్‌లో విడుదలై ఈ సినిమా ప్రేక్షకులను ఈ మేరకు అలరిస్తుందో లేదో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

  • Share this:
    Uppena Movie Twitter Review: తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘ఉప్పెన’ ఒకటి. ఇప్పటికే చిరంజీవి కుటుంబంలో చాలా మంది హీరోలు వెండితెరకు పరిచమై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కోవలోనే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌ల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.. ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాతో కృతి శెట్టి కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేసాడు. డైెరెక్టర్‌గా ఆయనకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను టాలీవుడ్‌లో వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు నిర్మించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

    ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి వ‌చ్చిన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు, విజ‌య్ సేతుప‌తి యాక్టింగ్‌ ఉప్పెన‌ చిత్రంపై అంచనాలు పెరిగేలా చేసాయి. దానికి తోడు ఈ మూవీలో క్లైమాక్స్ విభిన్నంగా ఉండ‌నుంద‌ని పుకార్లు రావ‌డంతో మెగాభిమానులే కాదు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి వాళ్లు ఈ సినిమా చూసి తన అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా పలువురు మెగాభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదిక పంచుకుంటున్నారు.



    కొంత మంది ఈ సినిమా సూపర్‌గా ఉంది. క్లైమాక్స్ అదిరపోయిందన్నారు. మెగా కుటుంబం నుంచి మరో పవర్‌ఫుల్ హీరో వచ్చాడని కొనియాడుతున్నారు.


    మరికొంత మంది ఈ సినిమా రొటిన్ సొల్లు మూవీ. ఇందులో ఏమిలేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.


    అంతేకాదు ఈ సినిమా గతంలో మరాఠీలో వచ్చిన ‘సైరత్’ మూవీకి కాపీ పేస్ట్‌లా ఉందంటున్నారు. ఇంకొంతరు కలర్ ఫోటో సినిమాను గుర్తుకు తెస్తున్నారు.


    మరి కొంత మంది మేము థియేటర్స్‌లో ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. ఇక విజయ్ సేతుపతి యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. కృతి శెట్టి తనదైన నటనతో ఆకట్టుకుందని చెబుతున్నారు. హీరోగా వైష్ణవ్ తేజ్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. గతంలో చూసిన స్టోరీలా ఉన్న ట్రీట్‌మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఉందని చెబుతున్నారు.


    గురువు సుకుమార్‌లా అతని శిష్యుడు బుచ్చిబాబు.. ఉప్పెనతో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు అనిపించుకున్నాడని చెబుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: