Home /News /movies /

Uppena team at Tirumala: తిరుమల కొండపై ‘ఉప్పెన’ టీం.. మెట్లెక్కి దర్శించుకున్న వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి..

Uppena team at Tirumala: తిరుమల కొండపై ‘ఉప్పెన’ టీం.. మెట్లెక్కి దర్శించుకున్న వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి..

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి : ఉప్పెన Photo : Twitter

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి : ఉప్పెన Photo : Twitter

Uppena team at Tirumala: 2021లో ఊహించని కలెక్షన్స్ ఉప్పెన తీసుకొచ్చారు ఉప్పెన టీం. అంచనాలకు అందని రీతిలో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. ఒకటి రెండు కాదు.. రెండు వారాల్లో ఏకంగా 48 కోట్ల షేర్ వసూలు చేసి 50 కోట్ల..

ఇంకా చదవండి ...
2021లో ఊహించని కలెక్షన్స్ ఉప్పెన తీసుకొచ్చారు ఉప్పెన టీం. అంచనాలకు అందని రీతిలో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. ఒకటి రెండు కాదు.. రెండు వారాల్లో ఏకంగా 48 కోట్ల షేర్ వసూలు చేసి 50 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. తొలి సినిమాతోనే 50 కోట్ల షేర్ అందుకున్న తొలి హీరోగా ఇండియన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు వైష్ణవ్ తేజ్. ఈయన దూకుడు చూసి కుర్రాడికి మంచి ఫ్యూచర్ ఉంది అంటూ ఫిక్స్ అయిపోతున్నారు మెగా ఫ్యాన్స్ కూడా. మరోవైపు ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందర్నీ మాయ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు అయితే సింగిల్ సినిమా స్టార్ అయిపోయాడు. ఈయన కోసం ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా క్యూ కట్టారు. మైత్రి మూవీ మేకర్స్‌కు ఒక్క సినిమాతో మూడు సినిమాల నష్టాలు భర్తీ అయిపోయాయి. ఇలా ఒక్క ఉప్పెనతో చాలా మంది జీవితాలు మారిపోయాయి. అలాంటి సంచలన విజయం అందించినందుకు దేవుడికి మనసారా కృతజ్ఞతలు చెప్తున్నారు చిత్రయూనిట్. తాజాగా టీం అంతా తిరుమల కొండకు వెళ్లారు. సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అయినా కూడా ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వస్తుంటారు మన హీరోలు, నిర్మాతలు. అది చాలా రోజులుగా ఆనవాయితీగానే వస్తుంది. ఇప్పుడు దీన్ని కొనసాగించారు ఉప్పెన టీం కూడా. హీరో వైష్ణవ్ తేజ్.. హీరోయిన్ కృతి శెట్టితో పాటు దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత నవీన్ కూడా వాళ్లతో వచ్చారు. అంతా కాలినడకన కొండెక్కి స్వామిని దర్శించుకున్నారు.

మెట్లు ఎక్కి వస్తున్నపుడు వీడియో తీసి పోస్ట్ చేసారు కొందరు అభిమానులు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరో హీరోయిన్ కలిసి మెల్లగా మెట్లెక్కుతున్న ఫోటోలు, వీడియో బాగానే తిరుగుతుందిప్పుడు. వాళ్లతో పాటు నిర్మాత నవీన్ కూడా వెనక మెల్లగా నడుస్తూ వస్తున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు అక్కడ కూడా తన టీంను నవ్విస్తున్నాడు.
Uppena team at Tirumala,vaisshnav tej,vaisshnav tej twitter,krithi shetty,vaisshnav tej krithi shetty at tirumala,vaisshnav tej krithi shetty romance,vaisshnav tej krithi shetty love story,వైష్ణవ్ తేజ్,కృతి శెట్టి,వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి ఉప్పెన,ఉప్పెన టీం తిరుమల
ఉప్పెన సినిమా (Uppena movie)

ఏదేమైనా సినిమా విడుదలై రెండు వారాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఉప్పెన దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లనే తీసుకొస్తుండటం విశేషం. ఫిబ్రవరిలో విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఉప్పెన సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో మిర్చి 47 కోట్లు వసూలు చేస్తే ఇప్పుడు ఉప్పెన దాన్ని క్రాస్ చేసింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Krithi shetty, Telugu Cinema, Tollywood, Uppena, Vaishnav tej

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు