UPPENA MOVIE MAKERS RELEASED MAKING VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA MNJ
Uppena Making: వైష్ణవ్, కృతి ల నుంచి బుచ్చిబాబు నటనను ఎలా రాబట్టాడో చూడాల్సిందే.. అదరగొడుతున్న మేకింగ్ వీడియో
ఉప్పెన సినిమా కలెక్షన్స్ (Uppena movie collections)
Uppena Making: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా.. అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా.. మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి విలన్ గా తెరకెక్కిన చిత్రం ఉప్పెన. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. నూతన దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది
Uppena Making: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా.. అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా.. మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి విలన్ గా తెరకెక్కిన చిత్రం ఉప్పెన. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. నూతన దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. ఓవరాల్ కలెక్షన్స్ 70 కోట్లు దాటాయని మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఉప్పెన మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
ప్రేక్షకుల్లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. ఉప్పెన మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. ఇందులో ఆశీర్వాదం (వైష్ణవ్) , బేబమ్మ (కృతి) కొత్తవారైనా వారి నుంచి నటనను రాబట్టేందుకు బుచ్చిబాబు చాలా కృషి చేశాడు. ఎక్కడా అతికి పోకుండా.. అలాగే సినిమాలో ఉన్న సహజత్వం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రతి సీన్ ను వారికి చేసి చూపించాడు బుచ్చిబాబు. ముఖ్యంగా బేబమ్మ గా కృతి శెట్టి నటన యూత్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. దీని వెనుక బుచ్చిబాబు ఎంత కష్టపడ్డాడో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. బేబమ్మ నటన సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
ఇక విజయ్ సేతుపతి (రాయణం) ఈ సినిమాకు హైలైట్ గా నిలిచారు. ఆయన సహజ నటుడే అయినా.. మక్కల్ సెల్వం నుంచి అత్యద్భుత నటనను రాబట్టడంలో బుచ్చిబాబు సూపర్ సక్సెస్ అయ్యాడు. కూతురు మీద ప్రేమ చూపించే సన్నివేశాలు... హీరోను బెదిరించే సమయంలో క్రోదం.. రౌద్రం పండించే సీన్లను అలవోకగా చేశాడు విజయ్.
సినిమాలో హీరో, హీరోయిన్లు కొత్తవారు అయినప్పటికీ వారి నుంచి బెస్ట్ రాబట్టడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడని సినిమా చూసిన వారికి అర్థమవుతున్నది. అయితే దాని వెనుక బుచ్చిబాబు పడిన కష్టమంతా ఈ వీడియో చూస్తే అర్థమవుతున్నది.
Here's the hardwork, fun & passion behind Making of #Uppena 🌊
మొత్తానికి నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ తాను రాసుకున్న కథను తెరకెక్కించడంలో బుచ్చిబాబు సక్సెక్ అయ్యాడు. ఆంధ్రా తీర ప్రాంతంతో పాటు.. ఒడిశాలోని పలు లొకేషన్లలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ కు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా వచ్చి షూటింగ్ ను ఎంజాయ్ చేశారు. సుకుమార్ పర్యవేక్షణలో.. ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం.. ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా నీ నవ్వు నీలి సముద్రం.. జల జల పాతం నువ్వు.. పాటలైతే తెలుగు లోగిళ్లలో మార్మోగుతున్నాయి.