కృతి శెట్టి.. ఇప్పుడు ఈ పేరుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ పేరు కూడా కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తుంది. కన్నడ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు పట్టం కడుతున్నారు మన ప్రేక్షకులు. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. కృతి శెట్టి క్రేజ్ చూసి పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు. దర్శక నిర్మాతలు కూడా కృతి డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఈ భామను ముందుగానే బుక్ చేసుకోండి.. ఉప్పెన రిలీజ్ అయితే అమ్మాయి డేట్స్ దొరకవు అంటూ చిరంజీవి ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన మాటలు అక్షరాలా నిజం అవుతున్నాయి. నిజంగానే ఈ భామ డేట్స్ ఇప్పుడు బంగారం అయిపోతున్నాయి. అంతేకాదు రెండో సినిమాకే దాదాపు 75 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇంత సంచలనాలు రేపుతున్న కృతి శెట్టి వయసు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ భామకు ఎంత వయసు ఉంటుంది.. చూడ్డానికి మరీ చిన్న పిల్లలా ఉంది కదా అంటూ ఆసక్తి మొదలైంది. నిజంగానే కృతి చిన్న పిల్లే. ఈమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. 2003లో జన్మించింది కృతి శెట్టి. ప్లస్ టూ చదువుతున్న ఈ భామకు సినిమా అవకాశాలు మొదలయ్యాయి. ఉప్పెన సినిమాలో నటించే కంటే ముందే ఈమె యాడ్స్‌లోనూ నటించింది. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ భామ వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే అని తెలిసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. ఉప్పెనలో ఈ భామ నటనకు అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం నాని శ్యామ సింగ రాయ్‌తో పాటు సుధీర్ బాబు సినిమాలో కూడా నటిస్తుంది కృతి శెట్టి. దాంతో పాటు తమిళనాట కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krithi shetty, Telugu Cinema, Tollywood