Home /News /movies /

UPPENA MOVIE ACTRERSS KRITHI SHETTY OVERWHELMED WITH SUPER STAR MAHESH BABU REVIEW OVER HER PERFORMANCE PK

Mahesh Babu - Krithi Shetty: మహేష్ బాబు ఇచ్చిన షాక్‌తో గాల్లో తేలిపోతున్న కృతి శెట్టి..

మహేష్ బాబు కృతి శెట్టి (Uppena Mahesh babu)

మహేష్ బాబు కృతి శెట్టి (Uppena Mahesh babu)

Mahesh Babu - Krithi Shetty: ఉప్పెన సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది హీరోయిన్ కృతి శెట్టి. ఎక్కడ చూడు ఈ పిల్ల గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి.. అందులో నటించిన నటీనటుల గురించి ట్వీట్ చేసాడు..

ఇంకా చదవండి ...
ఉప్పెన సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది హీరోయిన్ కృతి శెట్టి. ఎక్కడ చూడు ఈ పిల్ల గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి.. అందులో నటించిన నటీనటుల గురించి ట్వీట్ చేసాడు సూపర్ స్టార్. దాంతో చిత్ర యూనిట్ అంతా ఫిదా అయిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి అయితే గాల్లో తేలిపోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన గురించి మాట్లాడటం.. తన పర్ఫార్మెన్స్ చూసి ప్రశంసించడంతో అసలు నేలమీద నిలబడటం లేదు కృతి. మొన్నామధ్య ఉప్పెన సినిమా గురించి ట్వీట్ చేసాడు మహేష్ బాబు. ఈ సినిమా గురించి చాలా పాజిటివ్స్ వింటున్నానని.. కచ్చితంగా ఇండియాకు వచ్చిన తర్వాత చూస్తానంటూ చెప్పుకొచ్చాడు. మొన్నటి వరకు దుబాయ్‌లో సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు మహేష్. ఇప్పుడు దుబాయ్ షెడ్యూల్ పూర్తి కావడంతో ఇండియాకు వచ్చాడు మహేష్. వచ్చీ రాగానే చెప్పినట్లుగానే ఉప్పెన సినిమా చూసాడు. చూసి వెంటనే తనకు అనిపించింది ట్వీట్ చేసాడు సూపర్ స్టార్. మనసులో ఉన్నదున్నట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. ఉప్పెన సినిమా అద్భుతంగా ఉందని చెప్తూ.. న్యూ కమర్స్ కాదు మీరు ఇప్పుడు స్టార్స్ అంటూ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి పర్ఫార్మెన్స్‌ను పొగిడేసాడు మహేష్ బాబు. దాంతో కృతి కూడా వెంటనే రిప్లై ఇచ్చింది.

ఓ మై గాడ్.. థ్యాంక్ యూ సర్.. మేం చేసిన హార్డ్ వర్క్‌కు ఈ రోజు ఫలితం కనిపించింది.. ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ చూసి గాల్లో తేలిపోతున్నాం కానీ స్వయంగా సూపర్ స్టార్ మా సినిమా చూసి ఇలా ట్వీట్ చేయడం నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సర్ అంటూ ట్వీట్ చేసింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Krithi shetty, Mahesh babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు