Uppena 4 days WW Collections: ‘ఉప్పెన’ 4 డేస్ కలెక్షన్స్.. 30 కోట్ల క్లబ్బులో చేరిపోయిన వైష్ణవ్ తేజ్..

ఉప్పెన సినిమా కలెక్షన్స్ (Uppena movie collections)

Uppena 4 days WW Collections: ‘ఉప్పెన’ వసూళ్ల సునామీ ఆగడం లేదు. ఏపీ తెలంగాణలో ఈ సినిమా దూకుడు కొనసాగుతుంది. ముఖ్యంగా వీకెండ్ ముగిసిన తర్వాత కూడా అదే స్టడీ కలెక్షన్స్ వసూలు చేయడంతో సినిమా నిలబడిందని అర్థమైపోయింది.

  • Share this:
‘ఉప్పెన’ వసూళ్ల సునామీ ఆగడం లేదు. ఏపీ తెలంగాణలో ఈ సినిమా దూకుడు కొనసాగుతుంది. ముఖ్యంగా వీకెండ్ ముగిసిన తర్వాత కూడా అదే స్టడీ కలెక్షన్స్ వసూలు చేయడంతో సినిమా నిలబడిందని అర్థమైపోయింది. వీకెండ్ వసూళ్లు 28 కోట్ల షేర్ దాటిపోయేసరికి పండగ చేసుకున్నారు బయ్యర్లు. 20 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకు మూడో రోజు నుంచే లాభాలు మొదలైపోయాయి. ఇప్పుడు నాలుగో రోజు కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది ఉప్పెన. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి గాల్లో తేలిపోతున్నారు బయ్యర్లు. ఆదివారంతో పోలిస్తే దాదాపు 40 శాతం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కానీ వీక్ డే మొదలైన తర్వాత కూడా ఈ స్థాయిలో వసూళ్లు ఉండటం అనేది చిన్న విషయం కాదు. నిర్మాతలు ఇచ్చిన లెక్కల ప్రకారం 4వ రోజు ఉప్పెన వసూలు చేసిన మొత్తం ఇలా ఉన్నాయి..

AP-TSలో ఉప్పెన 4వ రోజు వసూళ్లు..

నైజాం – 1.35 కోట్లు
సీడెడ్ – 82 లక్షలు
వైజాగ్ – 78 లక్షలు
తూర్పు – 48 లక్షలు
పశ్చిమ – 20.50 లక్షలు
గుంటూరు – 34 లక్షలు
కృష్ణా – 25 లక్షలు
నెల్లూరు -15 లక్షలు

రెండు తెలుగు రాష్ట్రాలలో 4వ రోజు మొత్తం – 4.6 కోట్లు షేర్

uppena movie collections,uppena 4 days ww collections,uppena movie,uppena movie 4th day collections,uppena 4 days collections,uppena box office collection,uppena day 4 ap ts collections,uppena day 4 collections,uppena box office collections,ఉప్పెన,ఉప్పెన 4 డేస్ కలెక్షన్స్,ఉప్పెన 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఉప్పెన సినిమా కలెక్షన్స్ (Uppena movie collections)


4 రోజుల కలెక్షన్స్..

నైజాం: 9.46 కోట్లు
సీడెడ్: 4.42 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.02 కోట్లు
ఈస్ట్: 2.90 కోట్లు
వెస్ట్: 1.75 కోట్లు
గుంటూరు: 1.94 కోట్లు
కృష్ణా: 2.01 కోట్లు
నెల్లూరు: 1.1 కోట్లు

AP-TG 4 రోజుల మొత్తం: 28.23 కోట్లు షేర్ (48.80 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 90 లక్షలు
ఓవర్సీస్ – 1.02 కోట్లు

వరల్డ్ వైడ్ 4 రోజుల మొత్తం – 32.34 కోట్లు షేర్ (56.30 కోట్లు గ్రాస్)
Published by:Praveen Kumar Vadla
First published: