• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • UPPENA HEROINE KRITI SHEETY PAIR UP WITH SUPER STAR MAHESH IN HIS NEXT MOVIE MHN

Mahesh - Kriti Shetty: ఒక సినిమాతోనే సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఉప్నెన భామ

Mahesh - Kriti Shetty: ఒక సినిమాతోనే సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఉప్నెన భామ

Uppena heroine Kriti Sheety pair up with super star Mahesh in his next movie

Mahesh - Kriti Shetty: సూపర్‌స్టార్ మహేశ్, అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని రీసెంట్‌గా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుందని అంటున్నారు

  • Share this:
    కృతిశెట్టి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆఫ్ టాలీవుడ్. ఈ క‌ర్ణాట‌క‌కి చెందిన అమ్మ‌డు న‌టించిన తొలి చిత్రం ‘ఉప్పెన‌’. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కాగానే ఆటోమెటిక్‌గా కృతి క్రేజ్ పీక్స్‌కు చేరుకుంది. ఇక ‘ఉప్పెన‌’ సినిమా విడుద‌లైన త‌ర్వాత సినిమా స‌క్సెస్ కావ‌డంతో పాటు కుర్ర‌కారులో కృతిశెట్టికి క్రేజ్ మూడింత‌లైంది. దీంతో మేక‌ర్స్ కృతిని హీరోయిన్‌గా పెట్టి సినిమాలు చేయ‌డానికి పోటీ ప‌డ్డారు. ఆరు ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ కాస్త‌.. అరకోటి.. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయ‌లు ఇస్తే కానీ.. డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేన‌ని చెప్పేస్తుంద‌ట కృతి శెట్టి. అయినా అంత డిమాండ్‌లోనూ కృతిశెట్టికి ఓ గోల్డెన్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు టాలీవుడ్ సినీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

    వివ‌రాల మేర‌కు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ నెక్ట్స్ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని టాక్ గ‌ట్టిగానే వినిపిస్తుంది. ప్ర‌స్తుతం మ‌హేశ్ త‌న 27వ చిత్రం ‘స‌ర్కారువారిపాట‌’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ సినిమా ఉంటుంద‌నే వార్త‌లు వ‌చ్చినా.. ద‌ర్శ‌కధీరుడితో మ‌హేశ్ సినిమా చేసే లోపు మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించేలా ప్లాన్ చేసేశాడ‌ట‌.ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టి న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కృతిశెట్టి ఇప్పుడు సుధీర్‌బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. నానితో శ్యామ్ సింగ‌రాయ్‌, రామ్‌, లింగుస్వామి సినిమాలోనూ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్న‌వి, సెట్స‌పైకి వెళ్లేవి మాత్ర‌మే.

    కేవ‌లం ఓ సినిమాతోనే కృతిశెట్టి క్రేజ్ పీక్స్‌కు చేరుకుంది. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే సూప‌ర్‌స్టార్ మూవీలో న‌టించ‌డం ప‌క్కా. ప్ర‌స్తుతం ఎఫ్‌3 సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్న అనీల్ రావిపూడి.. ఇది వ‌ర‌కు మ‌హేశ్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా చేశాడు. ఇప్పుడు మ‌రో సినిమాను చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు