Home /News /movies /

Uppena Heroine Kriti Shetty: కృతి శెట్టికి పాతిక ల‌క్ష‌లు ఇచ్చిన నిర్మాత ఎవ‌రో తెలుసా?

Uppena Heroine Kriti Shetty: కృతి శెట్టికి పాతిక ల‌క్ష‌లు ఇచ్చిన నిర్మాత ఎవ‌రో తెలుసా?

Uppena Heroine Krithi Shetty gets gift  from that producers of mythri movie makers

Uppena Heroine Krithi Shetty gets gift from that producers of mythri movie makers

Uppena Heroine Kriti Shetty: ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలకు నిర్మాతలు భారీ మొత్తాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు

    ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు వాళ్లు వీళ్లూ ఏవో గిఫ్ట్ లు ఇస్తూ ఉంటార‌ని వింటూనే ఉంటాం. అదిగో ఆ హీరోయిన్‌కి కారు కొనిచ్చార‌ట‌. ఇదిగో ఈ హీరోయిన్‌కి ఫ‌లానా వ్య‌క్తి ఫ్లాట్ కొనిచ్చార‌ట అనే గాసిప్స్ కి హ‌ద్దే ఉండ‌దు. అయితే ఇవ‌న్నీ పేరు మోసిన హీరోయిన్ల విష‌యంలో వినిపిస్తూ ఉంటాయి.
    అయితే డెబ్యూ హీరోయిన్ విష‌యంలోనూ ఇప్పుడు ఇలాంటి న్యూస్ వైర‌ల్ అవుతోంది. అంతా ఇంతా కాదు... ఏకంగా పాతిక ల‌క్ష‌లు ఆమెకు ఇచ్చేశార‌నే వార్త బ‌య‌టికొచ్చింది. ఇంత‌కీ రీసెంట్ టైమ్స్ లో బాగా పాపుల‌ర్ అయిన డెబ్యూ హీరోయిన్ అన‌గానే అంద‌రికీ చటుక్కున కృతి శెట్టి గుర్తుకొచ్చేసి ఉంటుంది క‌దా. ఈ హీరోయిన్‌కే పాతిక ల‌క్ష‌లు ఇచ్చార‌ట‌. ఇది కూడా దొంగాచాటుగా ఎవ‌రో కాదు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వాళ్లే. అది కూడా అఫిషియ‌ల్‌గానే!

    య‌స్.. ఉప్పెన సినిమా వంద కోట్ల మార్కు తాకుతుంద‌ని సుకుమార్ ఏ ముహూర్తంలో అన్నారోగానీ, అన్నంతా జ‌రిగేలా ఉంది. ఇప్ప‌టికే ఈ ఏడెబ్యూ హీరోకీ రానంత బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు వ‌చ్చేశాయి వైష్ణ‌వ్ తేజ్‌కి. యాక్చువ‌ల్‌గా ఉప్పెన‌కు రెమ్యున‌రేష‌న్‌గా వైష్ణ‌వ్‌కి ఒన్లీ 50 ల‌క్ష‌లే ఇచ్చార‌ట‌. అందుకే ఇప్పుడు సినిమా పెద్ద హిట్ కొట్ట‌డంతో ఇంకో కోటి రూపాయ‌లు ఇచ్చార‌ట‌.

    డెబ్యూ హీరోయిన్ అయినా కృతికి రూ.10ల‌క్ష‌లు ఇచ్చార‌ట‌. ఇప్పుడు స‌క్సెస్ కావ‌డంతో ఇంకో పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును ఇచ్చార‌ట‌. ఇక డైర‌క్ట‌ర్ సానా బుచ్చిబాబుకైతే రూ.కోటి విలువ చేసే బ‌హుమ‌తి రెడీ అవుతోంద‌ట‌. సో ఆల్రెడీ వ‌రుస‌గా సినిమాల బుక్కింగులు స్టార్ట‌యిపోయాయి ఈ ముగ్గురికి. ఇప్పుడు మైత్రీ వారి నుంచి అద‌న‌పు బ‌హుమ‌తి. భ‌లేగుంది క‌దా బాసూ.. స‌క్సెస్ టేస్టు!
    Published by:Anil
    First published:

    Tags: Krithi shetty, Uppena

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు