Krithi Shetty: అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ‘ఉప్పెన’ హీరోయిన్.. వైష్ణవ్ తేజ్ షాకింగ్ నిజాలు..

వైష్ణవ్ తేజ్ ఉప్పెన (Uppena movie)

Krithi Shetty: అమ్మాయిలు అంటేనే సుకుమారం.. అందులోనూ కొందరు మరీ సుకుమారంగా ఉంటారు. ఇక హీరోయిన్‌లు అయితే తాకితే కందిపోయేలా ఉంటారు. అలాంటి ముద్దుగుమ్మలు ఒక్కోసారి ఎండలో కష్టపడాల్సి వస్తుంది..

  • Share this:
అమ్మాయిలు అంటేనే సుకుమారం.. అందులోనూ కొందరు మరీ సుకుమారంగా ఉంటారు. ఇక హీరోయిన్‌లు అయితే తాకితే కందిపోయేలా ఉంటారు. అలాంటి ముద్దుగుమ్మలు ఒక్కోసారి ఎండలో కష్టపడాల్సి వస్తుంది.. షూటింగ్స్ కోసం ఎక్కడెక్కడో ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. ఈ మధ్య కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ యంగ్ హీరోయిన్ షూటింగ్‌లోనే కళ్లు తిరిగి పడిపోయింది. ఆమె ఎవరో కాదు.. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ఫిబ్రవరి 12న విడుదల కానుంది ఉప్పెన. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా ప్రీ రిలీజ్ వేడుకలో అంతా చెప్పిన విధానం.. పొగిడిన పద్దతి చూసిన తర్వాత అంచనాలు మామూలుగా పెరిగిపోలేదు. ఏ మాత్రం వాటికి తగ్గినా కూడా అసలుకే మోసం వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే ఈ సినిమా కథ ప్రకారం అంతా సముద్ర తీర ప్రాంతంలోనే జరిగింది. దాంతో అక్కడే చాలా రోజుల పాటు ఉండాల్సి వచ్చింది. తీరప్రాంతం అంటే వేడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాకినాడ పరిసర మత్స్యకారులు నివసించే ఉప్పాడలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. దర్శకుడు బుచ్చిబాబు సొంతూరు అదే.
krithi shetty,vaishnav tej,vaishnav tej twitter,vaishnav tej instagram,vaishnav tej movies,vaishnav tej krithi shetty,vaishnav tej uppena movie,vaishnav tej shooting uppena at uppada,krithi shetty unconscious,కృతి శెట్టి,వైష్ణవ్ తేజ్,ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి అపస్మారక స్థితి
వైష్ణవ్ తేజ్ ఉప్పెన (Uppena movie)

దాంతో అక్కడే షూటింగ్ పూర్తి చేసాడు ఈయన. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ ముచ్చట్లు గుర్తు చేసుకున్నాడు హీరో వైష్ణవ్ తేజ్. ముఖ్యంగా తీర ప్రాంతం కావడంతో ఈ ఏరియా అంతా చాలా సెన్సిటివ్‌గా ఉంటుందని.. ఇక్కడ ఈదురు గాలులు, సముద్ర గాలులతో వాతావరణం చాలా సమస్యాత్మకంగా ఉంటుందని చెప్పాడు. దాంతో కొన్నిసార్లు తమకు ఆరోగ్యం కూడా చెడిందని.. ముఖ్యంగా తనకు అక్కడ షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత తీవ్రజ్వరం వచ్చిందని.. తగ్గడానికి టైమ్ పట్టిందని చెప్పాడు.
krithi shetty,vaishnav tej,vaishnav tej twitter,vaishnav tej instagram,vaishnav tej movies,vaishnav tej krithi shetty,vaishnav tej uppena movie,vaishnav tej shooting uppena at uppada,krithi shetty unconscious,కృతి శెట్టి,వైష్ణవ్ తేజ్,ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి అపస్మారక స్థితి
వైష్ణవ్ తేజ్ ఉప్పెన (Uppena movie)

ఇక హీరోయిన్ కృతి అయితే జ్వరంతో ఏకంగా అపస్మారక స్థితిలోకే వెళ్లిపోయిందని చెప్పాడు వైష్ణవ్. ఈమె కోలుకోడానికి టైమ్ పట్టిందని గుర్తు చేసుకున్నాడు. దాంతో పాటు టీంలో ఉన్న ప్రతీ ఒక్కరికి కూడా జ్వరం వచ్చిందని.. అక్కడి వాతావరణ పరిస్థితులు అలా ఉంటాయని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్.
Published by:Praveen Kumar Vadla
First published: