UPPENA FILM HEROINE KRITHI SHETTY SAYS THAT THIS SHE WILL HATE IN MENS NR
Krithi Shetty: అబ్బాయిల్లో ఆ విషయం అసలు నచ్చదంటున్నా బెబమ్మ.. ఏమిటంటే?
Krithi Shetty
Krithi Shetty: ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రతో మెప్పించి స్టార్ డమ్ ను అందుకున్న కృతి శెట్టి.. తొలిసారి నటనతో మంచి గుర్తింపు అందుకుంది. ఒక్క చూపుతో, ఒక్క నవ్వుతో కుర్రాళ్ల మతి పోగొట్టిన ఈ బ్యూటీ..
Krithi Shetty: ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రతో మెప్పించి స్టార్ డమ్ ను అందుకున్న కృతి శెట్టి.. తొలిసారి నటనతో మంచి గుర్తింపు అందుకుంది. ఒక్క చూపుతో, ఒక్క నవ్వుతో కుర్రాళ్ల మతి పోగొట్టిన ఈ బ్యూటీ.. మొత్తానికి మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంది. లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటించనున్న రాపో 16 సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా నాచురల్ స్టార్ హీరో నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇదే కాకుండా మరో హీరో సుధీర్ బాబు తో కలిసి ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది అనే సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడికి పురుషుల్లో నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయట..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తనకు అబద్ధం చెప్పే వాళ్లంటే నచ్చరని, నిజాయితీగా, బోల్డ్ గా ఉండే వ్యక్తి అంటే ఇష్టమని తెలిపింది. అంతేకాకుండా ఏ విషయమైనా మొహమాటం పడకుండా తన ముఖం మీద చెప్పే అంత ధైర్యం ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటికే మూడు అవకాశాలను అందుకున్న కృతి శెట్టి.. మరో రెండు సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నట్లు వార్తలు వినిపించాయి. హీరో నిఖిల్ నటించనున్న సినిమాలో, రాణా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ నటించిన మరో సినిమాలో అవకాశాలు వచ్చాయని..వార్తలు వినిపించగా, అవి కేవలం పుకార్లు అని ఇటీవలే తెలిపింది. అంతేకాకుండా తాను తర్వాత నటించే సినిమాలలో అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఓకే అన్నప్పుడు వాటి గురించి వివరాలు తెలుపుతానని తెలిపింది ఈ బ్యూటీ.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.