Ntr - Trivikram: కృతిశెట్టి ల‌క్కీ ఛాన్స్... యంగ్ టైగ‌ర్ సినిమాలో ఛాన్స్‌.. నిజ‌మెంత‌?

Uppena fame Kriti Shetty in Ntr and Trivikram movie

Ntr - Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    మ‌లయాళ బ్యూటీ కృతిశెట్టి క్రేజీ హీరోయిన్‌గా అంద‌రి దృష్టిలో ప‌డింది. తొలి సినిమా ఉప్పెన ఈ శుక్ర‌వారం విడుద‌లవుతుంది. అయితే ఈ అమ్మ‌డు సినిమా థియేట‌ర్స్‌ను తాక‌క ముందే స్టార్స్‌తో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. తాజా స‌మాచారం ఓ టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.
    ప్ర‌‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం) సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు ఎన్టీఆర్‌. ఈ సినిమా పూర్తి చేయ‌గానే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాదిలోనూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది.

    ప్ర‌స్తుతం ఎన్టీఆర్ 30 మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇందులో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై చాలా వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం మేరకు ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి .. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుందా లేక మ‌రెవరైనా న‌టిస్తారా? అని తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే. అలాగే త్రివిక్ర‌మ్ త‌న సినిమాల్లో ప్ర‌తినాయ‌కుల పాత్ర‌ల‌ను బ‌లంగా, వైవిధ్యంగా చూపిస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ కొత్త విల‌న్‌గా కోలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోను తెలుగులో విల‌న్‌గా ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఆ స్టార్ ఎవ‌రో కాదు. శిలంబ‌ర‌స‌న్ అలియాస్ శింబు. మ‌రి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న ఈ వార్త‌ల్లో నిజం ఎంతో తెలియాలంటే కొన్నాళ్లు ఆగ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే శింబు దగ్గ‌ర‌కు ప్ర‌తిపాద‌న వెళ్లి ఉండొచ్చు ఏమో కానీ.. ఆయ‌న ఒప్పుకుంటాడా? అనేది ఆలోచించాల్సిన విష‌య‌మే.

    ntr, trivikram, ntr 30, ntr next movie, ntr 30 latest update, ntr and trivikram movie update, bollywood heroine in ntr 30, kriti shetty in ntr 30, uppena heroine in ntr 30, tollywoodlatest news, telugu movie news, త్రివిక్రమ్, ఎన్టీఆర్, ఎన్టీఆర్ 30, SILAMBARASAN, simbu, kriti shetty, కృతిశెట్టి
    Uppena fame Kriti Shetty in Ntr and Trivikram movie


    అర‌వింద‌స‌మేత వీరరాఘ‌వ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిన క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. గ‌త ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది.
    Published by:Anil
    First published: