అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆయన సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న బంగార్రాజు సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించనుందని సమాచారం. కృతి శెట్టి ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తెచ్చిన ఆ క్రేజ్ తో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆఫర్లతో ఆమె ఇంటి తలుపు తడుతున్నారు. ఇక అది అలా ఉంటే “బంగార్రాజు” కోసం నిర్మాతలు కృతి శెట్టిని సంప్రదించారట. ఇందులో బేబమ్మను హీరోయిన్ గా నటించమని అడిగారట. కృతి శెట్టి బంగార్రాజులో నాగ చైతన్య సరసన నటించనున్నారని తెలిసింది. ఇక కృతి శెట్టి ప్రస్తుతానికి శ్యామ్ సింగ రాయ్, సుధీర్ బాబు, రామ్‌లతో సినిమాలను చేస్తోంది. మరోవైపు “బంగార్రాజు” స్క్రిప్ట్ దాదాపుగా పూర్తయింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దాని కోసం కాస్టింగ్ ప్రారంభించారు. ఈ సీక్వెల్‌లో నాగార్జున సరసన హిందీ నటి సోనాక్షి సిన్హా నటించనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. అయితే ఎప్పుడో ఈ సినిమా గురించి ప్రకటించగా.. ఇన్నాళ్లు స్క్రిప్టులో పలు మార్పులు చేసి ఫైనల్‌గా ఓకే అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జూలై చివరి వారం నుండి ప్రారంభం కానుందని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుందట.
ఇక నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా విషయానికి వస్తే... ఈ సినిమా ఓ షెడ్యూల్‌ను కూడా ముగించుకుంది. ఇక రెండవ షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ స్టైలిష్ యాక్షన్ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో నటుడు నాగార్జున కొత్తగా కనిపించనున్నాడట. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం ఇతర భాషలు నుండి నటీనటులను తీసుకుంటోందట చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాలో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్ నటిస్తోంది.
ఇక నాగార్జున నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ అనే ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Krithi shetty, Naga chaitanaya, Tollywood news