Vaishnav Tej- Krithi Shetty: ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన థియేటర్లలో దూసుకుపోతోంది. టైటిల్‌కి తగ్గట్లుగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్ల ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు సన ముగ్గురూ కొత్త వారే అయినప్పటికీ.. ఇందులో విజయ్ సేతుపతి ఉండటం, దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాపై మొదటి నుంచి క్రేజ్‌ని తీసుకొచ్చాయి. ఇక వీటితో పాటు ఉప్పెన క్లైమాక్స్‌పై వచ్చిన రూమర్లు, మూవీ విడుదల అయ్యాక సినిమాలో వచ్చే కీలక సన్నివేశం చాలా మందిని సినిమాను చూసేలా చేశాయి. ఇక ఈ మూవీ కథనం యూత్‌ని బాగా అట్రాక్ట్ చేయడంతో పలుచోట్ల థియేటర్లకు హౌజ్‌ఫుల్ బోర్డులు పడ్డాయి.
ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నాయి. సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న మూవీ యూనిట్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు సన వైష్ణవ్, కృతి శెట్టిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వీరిద్దరు ఇప్పుడు బిజీగా మారిపోయారని.. చెరో అర డజన్ చిత్రాలు చేతిలో ఉన్నాయని.. కానీ వారు చెప్పట్లేదని ఆయన అన్నారు. ఇక ఉప్పెన సీక్వెల్ ఉంటుందా అన్న ప్రశ్నకు.. సీక్వెల్ ఉంటే వీరితోనే చేయాలని, కానీ వీళ్లు ఇప్పటికే స్టార్లు అయ్యారు. అప్పుడు నాతో పనిచేయరేమో అని అన్నాడు. దానికి వైష్ణవ్, కృతి స్పందిస్తూ.. ఆయన అడిగితే కచ్చితంగా చేస్తాము. కానీ మమ్మల్ని ఇప్పటికీ అడగడం లేదు చూడండి అంటూ బుచ్చిబాబును ఆట పట్టించారు. ఇదిలా ఉంటే ఉప్పెన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ బుధవారం జరగనున్నాయి. ఈ వేడుకకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా రానున్నారు.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.