• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • UPPENA BEAUTY KRITI SHETTY GOT CRAZY OFFER WITH IN STAR HERO MOVIE MHN

Uppena Heroine Kriti Shetty: క్రేజీ ఆఫ‌ర్‌ను ద‌క్కించుకున్న ‘ఉప్పెన’ బ్యూటీ

Uppena Heroine Kriti Shetty: క్రేజీ ఆఫ‌ర్‌ను ద‌క్కించుకున్న ‘ఉప్పెన’ బ్యూటీ

Uppena beauty Kriti Shetty got crazy offer with in star hero movie

Uppena Heroine Kriti Shetty: తొలి చిత్రం ఉప్పెనతో సూపర్ హిట్ కొట్టిన కృతిశెట్టి మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశాన్ని దక్కించుకుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

  • Share this:
    ఎంత క‌ష్ట‌ప‌డ్డా నువ్వు గింజంత అదృష్టం కూడా క‌లిసి రావాల‌ని మ‌న పెద్ద‌లు అంటుంటారు. ఇది నిజ‌మ‌ని సినీ ప‌రిశ్ర‌మ‌ను చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే.. సెంటిమెంట్స్‌ను ఎక్కువ‌గా న‌మ్మే మ‌న సినిమా ఇండ‌స్ట్రీలో క‌ష్టంతో పాటు అదృష్టం కూడా క‌లిసి రావాలి. హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే కొంత మంది హీరోయిన్స్‌కు ఎంత అందంగా ఉన్న‌ప్ప‌టికీ ల‌క్ లేకుండా.. స్టార్ స్టేట‌స్‌ను అందుకోలేక‌పోయారు. కానీ కొంత మందికి తొలి సినిమా విడుద‌ల కాక‌పోయినా, అవ‌కాశాలు వెల్లువలా వ‌స్తుంటాయి. ఈ రెండో కేట‌గిరిలోకి చేరింది క‌న్న‌డ బ్యూటీ కృతి శెట్టి చేరింది. తొలి సినిమాఉప్పెన విడుద‌ల కాక‌ముందే కృతిశెట్టికి వ‌రుస అవ‌కాశాలు త‌లుపులు త‌ట్టాయి. రీసెంట్‌గా ఉప్పెన విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో.. అవ‌కాశాలు మ‌రింత ఎక్కువ‌గా మారాయి.

    ఇప్ప‌టికే నానితో శ్యామ్ సింగ‌రాయ్ మూవీలో న‌టిస్తున్న కృతిశెట్టి, సుధీర్‌బాబు సినిమాలోనూ న‌టించ‌డానికి ఓకే చెప్పింది. ప‌లు చిత్రాల్లో కృతి శెట్టి పేరు హీరోయిన్‌గా ప‌రిశీల‌న‌లో ఉందంటూ వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా..ఇప్పుడు మ‌రో సినిమాలో న‌టించ‌డానికి ఈ బ్యూటీ ఓకే చెప్పింది. ఇంత‌కీ కృతి ఓకే చెప్పిన ఆ కొత్త ప్రాజెక్ట్ ఏదో కాదు. హీరో రామ్‌, డైరెక్ట‌ర్ లింగుస్వామి కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న సినిమా. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా రూపొంద‌నుంది. చిట్టూరి శ్రీనివాస్ నిర్మాత‌.

    ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను తెలివిగా ఎంచుకుంటూ నెక్ట్స్ రేంజ్ హీరోయిన్‌గా ఎద‌గ‌డానికి కృతి శెట్టి ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రామ్ హీరో సినిమా అని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఈ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది కృతిశెట్టి. తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన కృతిశెట్టి, త‌మిళంలో హిట్ కొడుతుందో లేదో చూడాలి.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు