UPPENA BEAUTY KRITHI SHETTY IS A BIG FAN OF MEGA POWER STAR RAM CHARAN SHE LOVES HIS ALL MOVIES MNJ
Krithi Shetty- Ram Charan: రామ్ చరణ్‌కి పెద్ద ఫ్యాన్‌ని.. ఆ సినిమాలో ఇంకా నచ్చారు.. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి
కృతి శెట్టి రామ్ చరణ్
Ram Charan- Krithi Shetty: వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీ ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది కృతి శెట్టి. హీరోయిన్గా ఇదే ఆమెకు మొదటి సినిమా విశేషం(నిజానికి చెప్పాలంటే ఈ మూవీ కోసం మొదట వేరే హీరోయిన్ని అనుకున్నప్పటికీ.. ఆ తరువాత కృతి ఇందులో జాయిన్ అయ్యింది). అయితేనేం టీజర్, ట్రైలర్లో తన నటనతో అదరగొట్టేశారు కృతి
Ram Charan- Krithi Shetty: వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీ ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది కృతి శెట్టి. హీరోయిన్గా ఇదే ఆమెకు మొదటి సినిమా విశేషం(నిజానికి చెప్పాలంటే ఈ మూవీ కోసం మొదట వేరే హీరోయిన్ని అనుకున్నప్పటికీ.. ఆ తరువాత కృతి ఇందులో జాయిన్ అయ్యింది). అయితేనేం టీజర్, ట్రైలర్లో తన నటనతో అదరగొట్టేశారు కృతి. అంతేకాదు ఈ మూవీ పోస్టర్లలో కృతి లుక్స్ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా విడుదల అవ్వకముందే ఆ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓరేంజ్‌లో వచ్చేసింది. అలాగే ఇటీవల జరిగిన ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకలో తెలుగులో మాట్లాడి మరింత మంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ.. కాగా ఈ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది.
ఈ నేపథ్యంలో కృతి కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇష్టమైన హీరో ఎవరు అన్న ప్రశ్నకు.. రామ్ చరణ్ అని చెప్పింది. రామ్ చరణ్‌కి తాను పెద్ద ఫ్యాన్ గర్ల్ అని, ఆయన సినిమాలన్నీ చూశానని చెప్పుకొచ్చారు. ఇక ఉప్పెన ఆడిషన్స్‌కి వచ్చే సమయంలో రంగస్థలం చూడమన్నారని.. ఆ మూవీలో ఆయన ఇంకా నచ్చారని తెలిపారు. ఇక వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. సెట్స్‌లో అలా ఉండేవాడు కాదని, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడని తెలిపింది.
ఇక తాను హీరోయిన్ అవ్వడానికి ఇంట్లో వాళ్లు చాలా సపోర్ట్ ఇచ్చారని కృతి చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు నేను ఎవ్వరితో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. నేను మారేలా మా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇచ్చారు. ఇక షూటింగ్లలో అందరితో మాట్లాడటం వలన ఇప్పుడు కాస్త భయం తగ్గింది అని చెప్పుకొచ్చారు. కాగా ఎన్నో అంచనాల మధ్య ఉప్పెన ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.