Krithi Shetty: వ్యూస్‌లో దూసుకుపోతున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి డ్యాన్స్ వీడియో

కృతి శెట్టి twitter

Krithi Shetty Eswara song Dance: ఉప్పెన సినిమాలోని ఈశ్వ‌ర పాట‌కు ఆ సినిమా హీరోయిన్ కృతి శెట్టి కూచిపూడి స్టెప్పులు వేసిన విష‌యం తెలిసిందే. శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ వీడియోను విడుద‌ల చేశారు కృతి శెట్టి. ఈ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకోగా వ్యూస్‌లో దూసుకుపోతోంది.

  • Share this:
    Krithi Shetty Eswara song Dance: ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ మూవీ నుంచి ఆమె పోస్ట‌ర్లు విడుద‌లైన‌ప్ప‌టి నుంచే కృతికి ఫ్యాన్ ఫాలోయింగ్ మొద‌లైంది. ఇక ఆ త‌రువాత టీజ‌ర్, ట్రైల‌ర్‌లు రిలీజ్ అయ్యాక.. కృతికి క్రేజ్ మ‌రింత పెరిగింది. అంతేకాదు మొద‌టి సినిమా విడుద‌ల కాకుండానే ఆమెకు మరిన్ని అవ‌కాశాల‌ను తెచ్చిపెట్టింది. ఇక ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీ విడుద‌ల అయ్యాక కృతి హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీని చూసిన ప్ర‌తి ఒక్క‌రు కృతిపై ప్ర‌శంస‌లు కురిపించారు. మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ కృతి అద‌ర‌గొట్టింద‌ని.. విజ‌య్ సేతుప‌తితో ఉన్న స‌న్నివేశాల్లోనూ ఈ బ్యూటీ బాగా న‌టించింద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ క్ర‌మంలో ఆమెకు మ‌రిన్ని ఆఫ‌ర్లు కూడా క్యూ క‌ట్టాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇటీవ‌ల ఓ వీడియోను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

    ఉప్పెన సినిమాలోని ఈశ్వ‌ర పాట‌కు కూచిపూడి డ్యాన్స్ వేసి ఆ వీడియోను కృతి విడుద‌ల చేసింది. శివ‌రాత్రి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ వీడియో అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఇందులో కృతి హావ‌భావాలు ఆమె ఫ్యాన్స్‌ని బాగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో ఈ వీడియోకు మంచి వ్యూస్ కూడా వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ వీడియోకు వ్యూస్ 1 మిలియ‌న్ క్రాస్ అయ్యాయి. దీంతో కృతి క్రేజ్ మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.



    కాగా ప్ర‌స్తుతం కృతి, నానితో శ్యామ్ సింగ‌రాయ్‌లో న‌టిస్తోంది. ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి కూడా న‌టిస్తోంది. అలాగే సుధీర్ బాబుతో ఈ అమ్మాయి గురించి చెప్పాల‌ని ఉంది అనే సినిమ‌లో న‌టిస్తోంది. వీటితో పాటు రామ్, లింగు స్వామి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న బైలింగ్వుల్ మూవీలో కృతి హీరోయిన్‌గా చేస్తోంది. మ‌రిన్ని ప్రాజెక్ట్‌లను ఆమె వింటున్న‌ట్లు స‌మాచారం.
    Published by:Manjula S
    First published: