• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • UPPENA BEAUTY KRITHI SHETTY DEMAND FOR LAUNCH EVENTS READ FULL DETAILS HERE MNJ

Krithi Shetty: దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకున్న బేబమ్మ‌.. నిర్మాత‌ల‌కే కాదు వారికి కూడా షాక్

Krithi Shetty: దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకున్న బేబమ్మ‌.. నిర్మాత‌ల‌కే కాదు వారికి కూడా షాక్

కృతి శెట్టి

Krithi Shetty: ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ మూవీ నుంచి ఆమె పోస్ట‌ర్లు విడుద‌లైన‌ప్ప‌టి నుంచే కృతికి ఫ్యాన్ ఫాలోయింగ్ మొద‌లైంది. ఇక ఆ త‌రువాత టీజ‌ర్, ట్రైల‌ర్‌లు రిలీజ్ అయ్యాక.. కృతికి క్రేజ్ మ‌రింత పెరిగింది. అంతేకాదు మొద‌టి సినిమా విడుద‌ల కాకుండానే ఆమెకు మరిన్ని అవ‌కాశాల‌ను తెచ్చిపెట్టింది.

  • Share this:
    Krithi Shetty: ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ మూవీ నుంచి ఆమె పోస్ట‌ర్లు విడుద‌లైన‌ప్ప‌టి నుంచే కృతికి ఫ్యాన్ ఫాలోయింగ్ మొద‌లైంది. ఇక ఆ త‌రువాత టీజ‌ర్, ట్రైల‌ర్‌లు రిలీజ్ అయ్యాక.. కృతికి క్రేజ్ మ‌రింత పెరిగింది. అంతేకాదు మొద‌టి సినిమా విడుద‌ల కాకుండానే ఆమెకు మరిన్ని అవ‌కాశాల‌ను తెచ్చిపెట్టింది. ఆ త‌రువాత‌ ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీ విడుద‌ల అయ్యాక కృతి హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీని చూసిన ప్ర‌తి ఒక్క‌రు కృతిపై ప్ర‌శంస‌లు కురిపించారు. మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ కృతి అద‌ర‌గొట్టింద‌ని.. విజ‌య్ సేతుప‌తితో ఉన్న స‌న్నివేశాల్లోనూ ఈ బ్యూటీ బాగా న‌టించింద‌ని కామెంట్లు వినిపించాయి ఈ క్ర‌మంలో ఆమెకు ఇప్పుడు మ‌రిన్ని ఆఫ‌ర్లు కూడా క్యూ క‌ట్టాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు త‌న‌కు వ‌చ్చిన క్రేజ్‌ను బాగా ఉప‌యోగించుకుంటోంద‌ట బేబ‌మ్మ‌. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న చందాన.. తన‌కు ఉన్న డిమాండ్‌ను బాగా క్యాష్ చేసుకుంటుంద‌ట‌.

    ఈ క్ర‌మంలో ఇప్పటికే త‌న రెమ్యున‌రేష‌న్‌ను బాగా పెంచేసిందట కృతి. ఉప్పెన సినిమా కోసం కేవ‌లం రూ.6లక్ష‌లు తీసుకున్న ఈ న‌టి.. ఇప్పుడు రూ.60ల‌క్ష‌ల‌ను డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాత‌లు షాక్‌కు గుర‌వుతున్న‌ట్లు స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా కొంత‌మంది నిర్మాత‌లు కృతిని సంప్ర‌దిస్తున్న‌ట్లు తెలుస్తోంది.




    కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం రెమ్యున‌రేష‌న్ పెంచి నిర్మాత‌లనే కాదు ఈవెంట్ మేనేజ‌ర్ల‌కు సైతం షాక్ ఇస్తోంద‌ట కృతి. ఏదైనా లాంచ్‌కు రావాల‌నుకుంటే రూ.12 నుంచి రూ.14ల‌క్ష‌ల‌ను డిమాండ్ చేస్తుంద‌ట బేబమ్మ‌. దీంతో వారు కూడా కృతి డిమాండ్‌కు షాక్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే చాలా మంది హీరోయిన్లు ఇండ‌స్ట్రీకి హిట్‌తో ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ రెమ్యున‌రేష‌న్ పెంచేందుకు సాహ‌సించ‌రు. కానీ ఉప్పెన బ్యూటీ మాత్రం వారంద‌రికీ భిన్నంగా వెళుతోంది.

    ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం కృతి శెట్టి, నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌లో, సుధీర్ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ హీరోగా లింగు స్వామి తెర‌కెక్కిస్తోన్న బైలింగ్వ‌ల్ మూవీలో న‌టిస్తున్నారు.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు