Krithi Shetty remuneration: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం..

ఉప్పెన నటి కృతి శెట్టి (Krithi Shetty)

Krithi Shetty remuneration: ఏం చేస్తాం.. కొన్నిసార్లు కొందరు హీరోయిన్లకు సుడి అలా తిరుగుతుంది మరి. కొందరు ముద్దుగుమ్మలకు ఏళ్లకేళ్లు వేచి చూసినా కూడా హిట్స్ రావు. కానీ కొందరికి మాత్రం తొలి సినిమాతోనే చక్రం తిరిగిపోతుంది.

  • Share this:
ఏం చేస్తాం.. కొన్నిసార్లు కొందరు హీరోయిన్లకు సుడి అలా తిరుగుతుంది మరి. కొందరు ముద్దుగుమ్మలకు ఏళ్లకేళ్లు వేచి చూసినా కూడా హిట్స్ రావు. కానీ కొందరికి మాత్రం తొలి సినిమాతోనే చక్రం తిరిగిపోతుంది. ఇప్పుడు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. నిజానికి ఉప్పెనలో ముందు హీరోయిన్ ఈమె కాదు.. మనీషా రాజ్ అనే మరో అమ్మాయిని తీసుకుని ఎందుకో మనసు కుదరక కృతి వైపు వచ్చాడు దర్శకుడు బుచ్చిబాబు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ డెబ్యూ హీరోకు సాధ్యం కాని రీతిలో ఉప్పెన వసూళ్ల ఉప్పెన కురిపిస్తుంది. 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఔరా అనిపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా విడుదల కాకముందే ఇండస్ట్రీలో కృతి గురించి చర్చలు మొదలయ్యాయి. ఈమె ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చింది అంటూ ఆరా తీసారు. పైగా ప్రీరిలీజ్ వేడుకలో చిరంజీవి కూడా ఇదే చెప్పాడు. ఒక్కసారి ఉప్పెన విడుదలైతే ఈ అమ్మాయి మీకు దొరకమంటే కూడా దొరకదు.. ఇప్పుడే బుక్ చేసుకోండి అంటూ చెప్పాడు. అన్నట్లుగానే జరుగుతుందిప్పుడు. ఉప్పెన విడుదల తర్వాత కృతి డేట్స్ హాట్ కేక్ అయిపోయాయి.

krithi shetty,krithi shetty twitter,krithi shetty remuneration,uppena movie heroine krithi shetty,uppena heroine krithi shetty,krithi shetty movies,allu arjun bumper offer to krithi shetty,allu arjun eyes on uppena movie fame krithi shetty,allu arjun chance to krithi shetty in pushpa movie,uppena movie fame krithi shetty in pushpa movie,krithi shetty grabs chance in allu arjun pushpa movie,కృతి శెట్టి,కృతి శెట్టి రెమ్యునరేషన్,కృతి శెట్టి పారితోషికం
ఉప్పెన నటి కృతి శెట్టి (Krithi Shetty)


చాలా మంది నిర్మాతలు ఇప్పుడు కృతి డేట్స్ కోసం చూస్తున్నారు. కానీ ఆమెను సంప్రదించే కంటే ముందుగానే ఆమె రేట్ తెలిసి షాక్ అవుతున్నారు దర్శక నిర్మాతలు. ఉప్పెన సినిమా కోసం కేవలం 6 లక్షలు మాత్రమే తీసుకున్న ఈ బ్యూటీ.. ఈ సినిమా విడుదలకు ముందే నాని శ్యామ్ సింగ రాయ్.. సుధీర్ బాబు సినిమాల కోసం 25 లక్షల చొప్పున తీసుకుంటుంది. అయితే ఇకపై సైన్ చేసే సినిమాలకు మాత్రం అక్షరాలా 60 లక్షలు కావాలంటుంది.

krithi shetty,krithi shetty twitter,krithi shetty remuneration,uppena movie heroine krithi shetty,uppena heroine krithi shetty,krithi shetty movies,allu arjun bumper offer to krithi shetty,allu arjun eyes on uppena movie fame krithi shetty,allu arjun chance to krithi shetty in pushpa movie,uppena movie fame krithi shetty in pushpa movie,krithi shetty grabs chance in allu arjun pushpa movie,కృతి శెట్టి,కృతి శెట్టి రెమ్యునరేషన్,కృతి శెట్టి పారితోషికం
ఉప్పెన నటి కృతి శెట్టి (Krithi Shetty)


పైగా ఈమె వయసు ప్రస్తుతం 17 ఏళ్లు మాత్రమే. ప్లస్ టూలోనే ఉంది ఈ బ్యూటీ. ఉప్పెన సినిమా పిచ్చెక్కించిన తీరు చూసిన తర్వాత ఈమెకు ఎంతైనా ఇవ్వొచ్చులే అనుకుంటున్నారు నిర్మాతలు. అందాలు ఆరబోయకపోయినా కూడా నటన పరంగా కృతి సత్తా చూపిస్తుందని నమ్ముతున్నారు. అందుకే భారీ పారితోషికం అడుగుతున్నా కూడా సై అంటున్నారు దర్శక నిర్మాతలు. ఏదేమైనా కూడా 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు ప్రయాణం అంటే మాత్రం అద్భుతం అని చెప్పాలేమో..?
Published by:Praveen Kumar Vadla
First published: