Krithi Shetty remuneration: బాంబు పేల్చిన ‘ఉప్పెన’ బ్యూటీ.. రెండో సినిమాకే అన్ని లక్షలా..?

ఉప్పెన నటి కృతి శెట్టి (Krithi Shetty)

Krithi Shetty remuneration: ఇప్పుడు ఇదే అడుగుతున్నారు ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే 70 లక్షలు పారితోషికం అడుగుతుందంటూ వార్తలు వస్తున్నాయి. అది విని అంతా షాక్ అవుతున్నారు.

  • Share this:
ఇప్పుడు ఇదే అడుగుతున్నారు ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే 70 లక్షలు పారితోషికం అడుగుతుందంటూ వార్తలు వస్తున్నాయి. అది విని అంతా షాక్ అవుతున్నారు. ఆ భామ పేరు కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాలో హీరోయిన్‌గా నటించింది కృతి. ఈ సినిమా ఓటిటిలో విడుదల చేస్తున్నారనే టాక్స్ వచ్చినా కూడా కాదు థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా విడుదల కాకముందే ఇండస్ట్రీలో కృతి గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈమె ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చింది అంటూ ఆరా తీస్తున్నారు. తమ సినిమా కోసం తీసుకోడానికి కొందరు నిర్మాతలు ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకే కృతి డేట్స్ కోసం చూస్తున్నారు. కానీ ఆమెను సంప్రదించే కంటే ముందుగానే ఆమె రేట్ తెలిసి షాక్ అవుతున్నారు దర్శక నిర్మాతలు.

krithi shetty,krithi shetty twitter,krithi shetty remuneration,uppena movie heroine krithi shetty,uppena heroine krithi shetty,krithi shetty movies,allu arjun bumper offer to krithi shetty,allu arjun eyes on uppena movie fame krithi shetty,allu arjun chance to krithi shetty in pushpa movie,uppena movie fame krithi shetty in pushpa movie,krithi shetty grabs chance in allu arjun pushpa movie,కృతి శెట్టి,కృతి శెట్టి రెమ్యునరేషన్,కృతి శెట్టి పారితోషికం
ఉప్పెన నటి కృతి శెట్టి (Krithi Shetty)


రెండో సినిమా కోసమే 70 లక్షలు అడుగుతుందంటూ ప్రచారం జరుగుతుంది. పైగా ఈమె వయసు ప్రస్తుతం 16 ఏళ్లు మాత్రమే. ప్లస్ టూలోనే ఉంది ఈ బ్యూటీ. ఉప్పెన సినిమా పాటలు, స్టిల్స్ అన్నీ పిచ్చెక్కిస్తున్నాయి. దాంతో ఈమె కోసం దర్శక నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. అందాలు ఆరబోయకపోయినా కూడా నటన పరంగా కృతి సత్తా చూపిస్తుందని నమ్ముతున్నారు. అందుకే భారీ పారితోషికం అడుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

krithi shetty,krithi shetty twitter,krithi shetty remuneration,uppena movie heroine krithi shetty,uppena heroine krithi shetty,krithi shetty movies,allu arjun bumper offer to krithi shetty,allu arjun eyes on uppena movie fame krithi shetty,allu arjun chance to krithi shetty in pushpa movie,uppena movie fame krithi shetty in pushpa movie,krithi shetty grabs chance in allu arjun pushpa movie,కృతి శెట్టి,కృతి శెట్టి రెమ్యునరేషన్,కృతి శెట్టి పారితోషికం
ఉప్పెన నటి కృతి శెట్టి (Krithi Shetty)


ఇదే నిజమైతే మాత్రం అంతకంటే సంచలనం మరోటి ఉండదు. సింగిల్ సినిమా కూడా రాకుండా 70 లక్షల పారితోషికం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆమె సన్నిహితులు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తున్నారు. అసలు రెమ్యునరేషన్ గురించి చర్చ రాలేదని.. సినిమాను బట్టి పారితోషికం ఉంటుందని వాళ్లు హింట్ ఇస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: