Uppena 2 Weeks Collections: మెగా రెండో మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తొలి సినిమా ‘ఉప్నెన’ తోనే కలెక్షన్ల ఉప్పెన సృష్టిస్తున్నాడు. అంతేకాదు మెగా వారసుల్లో తొలి సినిమాతోనే ఈ రేంజ్ హిట్ అందుకున్నది వైష్ణవ్ తేజ్ కావడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్రను లిఖిస్తూ రికార్డులను తిరగరాస్తుంది. వైష్ణవ్ తేజ్ కలలో కూడా ఊహించని రికార్డులు ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడు. ఏకంగా ఇండియాలోనే మరే హీరోకు సాధ్యం కాని రీతిలో తొలి సినిమాతోనే భారీ వసూళ్లు సాధించాడు మెగా మేనల్లుడు. ఇప్పటికే ‘ఉప్పెన’ రూ. 80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ దాదాపు రూ. 44 కోట్ల వరకు ఉంది. సానా బుజ్జిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇదిలా ఉంటే తాజాగా మరో రికార్డు కూడా ఉప్పెన సినిమా కోసం వేచి చూస్తుంది. ఇది కూడా ఊహించని రికార్డే. తొలి సినిమాతోనే 50 కోట్ల షేర్ వసూలు చేసిన తొలి హీరోగా చరిత్రలో నిలిచిపోతాడు వైష్ణవ్ తేజ్. దానికి మరో 6 కోట్లు కావాలి. ఉప్పెన జోరు చూస్తుంటే ఇది సాధించేలాగే కనిపిస్తుంది. కరోనా ఎఫెక్ట్ తర్వాత 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైన తొలి సినిమా కావడంతో ఆ సత్తా చూపించింది ఉప్పెన.
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలైంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్లను దాటి లాభాల బాటను పట్టింది. ఈ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తైయింది. ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో రూ. 14.07 కోట్లను రాబట్టింది. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 6.95 కోట్లను కొల్లగొట్టింది. మిగతా ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 22.12 కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా తెలంగాణ, ఏపీలో కలిపి ఈ సినిమా రూ. 43.14 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. రెస్టాఫ్ ఇండియా రూ. 2. 20 కోట్లను రాబడితే.. ఓవర్సీస్లో మాత్రం రూ. 1.32 కోట్లను రాబట్టింది. వాల్డ్ వైడ్‌గా రూ. 46.66 కోట్ల షేర్ రాబట్టింది.
ఉప్పెన చిత్ర విషయానికొస్తే.. ఈ సినిమాను రూ. 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్.. రూ. 21 కోట్లను మూడు రోజుల్లోనే రాబట్టింది. ఇక రెండు వారాలు పూర్తయ్యే సరికి ఈ సినిమా రూ. 46.66 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌కు, బయ్యర్స్‌కు రూ. 26 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది. 2021లో ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. కథ మామూలుగానే ఉన్నా కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఉప్పెనతో సముద్రమంత విజయం అందుకున్నాడు. ఈయనతో పాటు హీరో హీరోయిన్లు, విజయ్ సేతుపతి పేర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిపోతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ కూడా ఉప్పెనకు అద్భుతమైన సంగీతం అందించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krithi shetty, Mythri Movie Makers, Tollywood, Tollywood Box Office Report, Vaishnav tej