హోమ్ /వార్తలు /సినిమా /

Upendra: ఓటీటీలోకి ఉపేంద్ర కబ్జా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Upendra: ఓటీటీలోకి ఉపేంద్ర కబ్జా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Upendra Kabzaa (Photo Twitter)

Upendra Kabzaa (Photo Twitter)

Kabzaa OTT Release Date: పాన్ ఇండియా లెవల్లో 'కబ్జ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విలక్షణ నటుడు ఉపేంద్ర. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పాన్ ఇండియా లెవల్లో 'కబ్జ' (Kabzaa) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విలక్షణ నటుడు ఉపేంద్ర (Upendra). కిచ్చా సుదీప్‌ సహా శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే థియేటర్లలో ఆశించిన మేర ఫలితం రాబట్టని ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీ వేదికపైకి తీసుకొస్తున్నారు.

ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే విడుదలై నెల తిరగక ముందే తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఏప్రిల్ 14 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఆర్‌ చంద్రు దర్శకత్వం వహించగా.. శ్రియ హీరోయిన్‌గా నటించింది.

చాలా రోజుల తర్వాత కబ్జా మూవీ ఆడియో లాంచ్ ఫంక్షన్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది శ్రీయ. ఈ షోకి అటెండ్ అయిన స్లిమ్ బ్యూటీ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్‌లో లైట్ రోజ్ కలర్ శారీ కట్టుకొని ట్రెడిషనల్ గెటప్‌లో ట్రెండీగా కనిపించింది. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. మూవీ అనౌన్స్ చేసిన రోజు నుంచి సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. కానీ ఆ అంచనాలు అందుకోలేక పోయింది కబ్జా.

కాగా ఈ కబ్జా సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి ఫస్ట్ పార్ట్ ఎలాగూ హిట్ కాలేదు కాబట్టి సెకండ్ పార్ట్‌పై ప్రేక్షకులు ఏ మేర ఇంట్రెస్ట్ చూపిస్తారో చూడాలి మరి.

First published:

Tags: Kabzaa Movie, Tollywood, Upendra

ఉత్తమ కథలు