హోమ్ /వార్తలు /సినిమా /

Upendra: కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు అస్వస్థత.. ఆస్పత్రిలో పరీక్షలు.. !

Upendra: కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు అస్వస్థత.. ఆస్పత్రిలో పరీక్షలు.. !

ఉపేంద్రకు అస్వస్థత

ఉపేంద్రకు అస్వస్థత

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆయనకు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు సమాచారం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర .. తెలుగు వారికి కూడా బాగా సుపరిచితమే. ఆయన  తెలుగులోనూ కూడా అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఈ  కన్నడ రియల్‌ స్టార్‌ ఉపేంద్ర స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌ చేరారు. షూటింగ్ సమయంలో శ్వాస కోసం సంబంధిత సమస్యతో ఇబ్బంది పడటం వల్ల వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది.

  అక్కడ కొన్ని పరీక్షల తరవాత ఆయనను డిశ్చార్చి చేశారు.  యూఐ అనే సినిమా షూటింగ్ సమయంలో ఉపేంద్ర అస్వస్థతకు గురయినటలు తెలుస్తోంది. అయిత తాజాగా తాను ఆరోగ్యంగా ఉన్నానని...ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ వీడియో రిలీజ్ చేశారు. స్వల్ప అస్వస్థతకు గురయ్యానని... చిన్న పరీక్షుల మాత్రమే నిర్వహించారన్నారు. ఇపుడు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నానని అంటూ ఆయన సెట్స్‌ నుంచి ఓ వీడియోను షూట్‌ చేసి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఉపేంద్ర బుద్దివంత 2, త్రిశూలం, కబ్జా సహా మరో చిత్రంలో నటిస్తున్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Kannada Cinema, Kannada Movies, Upendra