శుభవార్త చెప్పిన ఉపాసన... రాంచరణ్ ఇంట్లో సంబరాలు...

Upasana RamCharan : మెగా ఫ్యామిలీలో ఉన్నట్టుండి సంబరాలు మొదలయ్యాయి. అందుకు కారణం రాంచరణ్ వైఫ్ ఉపాసన. ఆ విశేషాలేంటో తెలుసుకూందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 27, 2019, 1:59 PM IST
శుభవార్త చెప్పిన ఉపాసన... రాంచరణ్ ఇంట్లో సంబరాలు...
రాంచరణ్, ఉపాసన
  • Share this:
మెగా ఫ్యామిలీ ఓ శుభవార్తను అందరితో పంచుకుంటోంది. రాంచరణ్, ఆయన సతీమణి ఉపాసనకు గుర్రాలంటే ఎంతో ఇష్టం. ఆడ గుర్రం ఫిల్లీని వాళ్లు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఫిల్లీకి పిల్ల పుట్టింది. అది చాలా అందంగా ఉందంటూ ట్విట్టర్‌లో ట్వీట్ పెట్టింది ఉపాసన. తల్లి గుర్రంతో ఉన్న పిల్ల గుర్రం ఉన్న ఫొటోను అందరికీ చూపించింది. అది పుట్టిన వేళా విశేషం బాగుందనీ, తాము ఎంతో సంతోషంగా ఉన్నామనీ, పిల్ల గుర్రం ఆరోగ్యంగా ఉందనీ తెలిపింది. అంతేకాదు... దానికి ఏదైనా పేరు పెట్టమని నెటిజన్లు, అభిమానులను సలహాలు, సూచనలూ కోరింది. ఇంత మంచి శుభవార్త చెప్పడంతో... మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఉపాసన పెట్టిన ఫొటోకు తెగ లైక్స్ వస్తున్నాయి.


చాలా మంది ఆ పిల్ల గుర్రానికి ఏ పేరు పెట్టాలనే దానిపై రకరకాల నేమ్స్ సజెస్ట్ చేస్తున్నారు. కరుణ్, రామ్, మస్తంగ్, బాద్షా, ద్రోణ, ధ్రువ, చిట్టి, ఉడాన్, చెర్రీ, రీనా, గ్రేసీ, హార్వీ, బంగారం, సనా, మిస్సీ ఇలా వందల కొద్దీ పేర్లు సూచిస్తున్నారు ఫ్యాన్స్. చిట్టి గుర్రం పుట్టినందుకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఫిల్లీకి పుట్టిన చిట్టి గుర్రం (Image : Twitter / Upasana
First published: July 27, 2019, 1:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading