రామ్ చరణ్ కత్తి లాంటీ ఫోటోలను షేర్ చేసిన ఉపాసన..

Instagram/upasanakaminenikonidela

పుట్టిన రోజు సందర్భంగా ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రామ్ చరణ్‌కు చెందిన రెండు అదిరిపోయే పిక్స్‌ను షేర్ చేసింది.

  • Share this:
    ఉపాసన కొణిదెల... రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో  హాస్పిటల్స్ విస్తరణలో తనదైన పాత్ర పోషిస్తూ అదరగొడుతున్నారు. అంతేకాదు ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అది అలా ఉంటే రామ్ చరణ్‌తో పెళ్లి తర్వాత ఉపాసన మంచి ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. అది అలా ఉంటే ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రామ్ చరణ్‌కు చెందిన రెండు అదిరిపోయే పిక్స్‌ను షేర్ చేసింది. చరణ్ తన 35వ పుట్టిన రోజును నిన్న జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఎలాంటి హంగులు లేకుండా రామ్ చరణ్ తన పుట్టిన రోజును జరుపుకున్నాడు. తన ఇంట్లో భార్య ఉపాసనతోనే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు చరణ్. అందులో భాగంగా ఉపాసన స్వయంగా తయారుచేసిన కేక్‌ను కట్ చేశాడు. దానికి సంబందించిన రెండు ఫోటోలను ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో చరణ్ వైట్ అండ్ వైట్ వేసి అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు చరణ్ పుట్టిన రోజున రాజమౌళి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. రౌద్రం రణం రుథిరం సినిమాలో చరణ్ లుక్ విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    Published by:Suresh Rachamalla
    First published: