మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అత్త RRR సినిమాలోని నాటు నాటు పాటకు కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Upasana) రియాక్ట్ అవుతూ ఆసక్తికరంగా కామెంట్ చేశారు. దీంతో ఈ వీడియో హాట్ టాపిక్ అయింది. మెగా ఫ్యాన్స్ సామజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఈ వీడియోను షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు.
రాజమౌళి రూపొందించిన RRR సినిమా మరోసారి తెలుగోడి సత్తాను ఎల్లలు దాటించింది. ఈ భారీ పాన్ ఇండియా సినిమాకు కాసుల వర్షం కురవడమే గాక పలు అవార్డులు, రివార్డులు దక్కుతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వ నైపుణ్యానికి, రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ నటనా ప్రతిభకు మచ్చుతునకలా నిలిచింది RRR. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కుంభ వర్షం కురిపించిన ఈ చిత్రం అవార్డుల పరం గానూ దూసుకెళుతోంది.
ఇటీవలే RRR మూవీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో పాటు క్రిటిక్స్ చాయిస్ అవార్డు కూడా దక్కించుకుంది. దీంతో మరోసారి RRR ట్రెండ్ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో ఇప్పుడు ఆ ఐకానిక్ స్టెప్పులను వేస్తూ జనం హుషారెత్తిపోతున్నారు. ఇందులో చెర్రీ అత్త, ఉపాసన తల్లి శోభన కామినేని (Shobhana Kamineni) కూడా ఒకరుగా నిలవడం విశేషం.
Very proud mother in law - #NatuNatu in Davos ❤️???? Love mom @shobanakamineni https://t.co/yBc6CI4f79
— Upasana Konidela (@upasanakonidela) January 18, 2023
రోడ్డు మీద నాటు నాటు అంటూ స్టెప్పులేసి మెగా అభిమానులను ఫిదా చేశారు ఉపాసన తల్లి శోభన కామినేని. ఈ వీడియో చూసిన ఉపాసన క్రేజీగా రియాక్ట్ అయింది. దావోస్‌లో ఇలా తన అల్లుడి గొప్పదనాన్ని చూసి అత్తగా ఎంతో గర్వపడుతోంది. లవ్యూ మామ్ అని పేర్కొంటూ సదరు వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది ఉపాసన. ఈ వీడియో క్లిప్ చూసి మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
పలు రికార్డులు సొంతం చేసుకుంటున్న RRR అంతర్జాతీయ వేదికలపై ప్రభంజనం సృష్టిస్తుండటం సగటు భారతీయ ప్రేక్షకుడిలో పట్టలేని ఆనందం నింపుతోంది. తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటుతుండటం పట్ల ఖుషీ అవుతున్నారు ఆడియన్స్. అటు RRR టీం అంతా కూడా తెగ సంబరపడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Charan, RRR, Upasana kamineni