Home /News /movies /

UPASANA KONIDELA SHARES CHILDHOOD PHOTO WITH HIS TEACHER SB

ఈ ఫోటోలో ఉన్నది ఓ స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తుపట్టండి?

గురు పౌర్ణమి సందర్భంగా తన చిన్నప్పటి ఫోటోను షేర్ చేశారు. తన టీచర్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.

గురు పౌర్ణమి సందర్భంగా తన చిన్నప్పటి ఫోటోను షేర్ చేశారు. తన టీచర్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.

గురు పౌర్ణమి సందర్భంగా తన చిన్నప్పటి ఫోటోను షేర్ చేశారు. తన టీచర్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.

    స్టార్లు, సెలబ్రిటీలు, క్రికెటర్లు చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఇక వారి అభిమానులు కూడా వాళ్ల చిన్నప్పటి విశేషాలను, ఫోటోలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. తమ అభిమాన హీరోలు, సెలబ్రిటీలు.. చిన్ననాటి విషయాల్ని ఫోటోలను షేర్ చేస్తుంటే వెంటనే వాటిని వైరల్ చేస్తుంటారు. ఇక తాజాగా ఓ సెలబ్రిటీ గురు పౌర్ణమి సందర్భంగా తన చిన్నప్పటి ఫోటోను షేర్ చేశారు. తన టీచర్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. అందులో తన గురువుకు ధన్య వాదాలు చెబుతూ.... టీచర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    ఆ సెలబ్రిటీ ఎవరో కాదు...  మెగాస్టార్ కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) కొణిదెల. గురు పౌర్ణమి సందర్భంగా ఉపాసన తనకు పాఠాలు చెప్పిన టీచర్‌కు గురుపౌర్ణమి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది. ఇక ఉపాసనకు కూడా సోషల్ మీడియాలో ప్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా మెగా కోడలిగా ఉపాసన ఎంతో గొప్ప పేరు సంపాదించింది. తన మంచి మనసుతో ఎంతో మందికి కూడా సహాయం చేస్తూ ఉంటుంది ఉపాసన. ఇటీవల ఉపాసన రాంచరణ్‌తో కలిసి విదేశాలకు వెళ్లి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది.



    ఉపాసన కు దేవుడిపై కాస్త భక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు పలు దేవాలయాలకు వెళుతూ ఉంటుంది. ఇక భర్త రామ్ చరణ్ తో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్తూ ఉంటుంది ఉపాసన. ఇక ఉపానసనకు మూగజీవాలంటే చాలా ఇష్టం. అందుకే ఆమె కొన్ని జంతువుల్ని దత్తత  కూడా తీసుకుంటుంది. అంతే కాదు సోషల్ సర్వీస్ చేస్తూనే మూగజీవాల పరిరక్షణ చేపట్టే ఆమె కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి సాయపడ్డారు. అలాగే బీ పాజిటివ్ అనే మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. సోషల్ మీడియా వేదికగా పలు ఆరోగ్య సంబంధిత సూచనలు ఇస్తుంటారు. మహిళా సాధికారత కోసం ఆమె కృషి చేస్తుంటారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Ram Charan, Tollywood, Upasana konidela

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు