ఉపాసన గదిలో స్టార్ హీరో కూతురి ఫోటో

news18-telugu
Updated: December 11, 2019, 11:48 AM IST
ఉపాసన గదిలో స్టార్ హీరో కూతురి ఫోటో
Instagram/upasanakaminenikonidela
  • Share this:
మెగాస్టార్ కోడలు.. మెగా పవర్ స్టార్ సతీమణి అయిన ఉపాసన కొణిదెల సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఉపాసన ఇన్‌స్టా వేదికగా సెల్ఫీని షేర్‌ చేశారు. అందులో ఆమె  ఓగదిలో డ్రెస్సింగ్‌ టేబుల్‌ ఎదురుగా కూర్చొని సెల్ఫీ తీసుకున్న ఫోటోను అభిమానుల కోసం తన సోషల్ మీియా పేజీల్లో  పోస్టు చేశారు.  'నేను పర్‌ఫెక్ట్‌ కాదు కానీ, నేను ఒరిజినల్‌' అని ఆమె పేర్కొన్నారు. అయితే ఉపాసన షేర్‌ చేసిన సెల్ఫీలో ఆసక్తికర విషయాన్ని నెటిజన్స్ గుర్తించారు. అదేమిటంటే.. మేకప్‌ టేబుల్‌పై మేకప్ కిట్ మధ్యలో ఓ అపురూపమైన ఫొటో ఫ్రేమ్‌ ఉంది. అందులో ఉపాసన, ఒక వేడుకలో మహేశ్‌ కుమార్తె సితారతో కలిసి దిగిన ఫొటోను పెట్టుకున్నారు. అప్పట్లో మహేష్ కూతురితో దిగిన ఫోటోను ఆమె ఫ్రేమ్ కట్టించుకొని మరి గదిలో పెట్టుకున్నారు. ఉపాసన షేర్‌ చేసిన ఫొటోకు అభిమానులు, సినీ ప్రముఖులు లైకులు కొడుతున్నారు. మరోవైపు నమ్రత సైతం ఈ పోస్టుకు లైక్‌ కొట్టారు.

ఉపాసన సెల్ఫీ


గతేడాది నారా బ్రహ్మాణి-లోకేశ్‌ల కుమారుడు దేవాన్ష్‌ బర్త్‌డే వేడుకల్లో  హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో సినీ ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు. అయితే, ఆ వేడుకకు హాజరైన మహేశ్‌ కుమార్తె సితారతో కలిసి ఉపాసన ఫొటో దిగారు. అంతేకాకుండా 'విత్‌ మై బెస్టీ సితార' అని ఉపాసన అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>