రామ్ చరణ్, సానియా మీర్జా వీడియో షేర్ చేసిన ఉపాసన..

రామ్ చరణ్ కేవలం సినిమాలే కాదు పార్టీలతో కూడా బిజీగా ఉంటాడు. ముఖ్యంగా ఈయనకు ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు. అందులో సానియా మీర్జా ఒకరు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 14, 2019, 8:10 PM IST
రామ్ చరణ్, సానియా మీర్జా వీడియో షేర్ చేసిన ఉపాసన..
రామ్ చరణ్ ఉపాసన
  • Share this:
రామ్ చరణ్ కేవలం సినిమాలే కాదు పార్టీలతో కూడా బిజీగా ఉంటాడు. ముఖ్యంగా ఈయనకు ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు. అందులో సానియా మీర్జా ఒకరు. వాళ్లింట్లో ఏ వేడుక జరిగినా కూడా మొదటి అతిథి రామ్ చరణ్. ఆ బ్యాచ్ అంతా ఎప్పుడూ పండగ చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు చరణ్. తాజాగా సానియా చెల్లికి, అజార్ తనయుడికి పెళ్లి జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది వచ్చారు. అందులో రామ్ చరణ్ దంపతులు కూడా ఉన్నారు. అంతేకాదు పెళ్లి తర్వాత జరిగిన పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేసారు కూడా.



దానికి సంబంధించిన ఓ వీడియోను ఇప్పుడు ఉపాసన షేర్ చేసింది. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇందులో సానియాతో కలిసి డాన్స్ చేస్తున్నాడు చరణ్. దీన్నే రాకింగ్ ది డాన్స్ ఫ్లోర్ అంటారంటూ పోస్ట్ చేసింది ఉపాసన. సానియాతో పాటు మరో లేడీతో కలిసి కాలు కదిపాడు మెగా వారసుడు. దాన్ని ఉపాసన క్యాప్చర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మొత్తానికి సినిమాల్లోనే కాదు ఫ్రెండ్స్‌తో కలిసినపుడు కూడా ఫుల్లుగా పార్టీ చేసుకుంటాడని ఈ వీడియో చూస్తుంటే మరోసారి అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>