హోమ్ /వార్తలు /సినిమా /

ఈ ఫోటోలో ఉన్నది... మెగా హీరో భార్య... ఎవరో గుర్తు పట్టండి ?

ఈ ఫోటోలో ఉన్నది... మెగా హీరో భార్య... ఎవరో గుర్తు పట్టండి ?

అక్కతో కలిసి ఉపాసన

అక్కతో కలిసి ఉపాసన

తన అక్క బర్త్ డే సందర్భంగా అక్కతో కలిసి చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలో ఆమెను చూసిన అభిమానులు చాలా క్యూట్‌గా ఉన్నారంటూ.. కామెంట్లు చేస్తున్నారు.

ఫోటో అనేది ఎవరికి అయినా ఓ జ్ఞాపకం.తమకు ఇష్టమైన వారితో దిగిన ఫోటోలను... చూస్తు సంతోషం వ్యక్తం చేస్తుంటారు.కొందరు తీరిక సమయాల్లో తమ పాత ఫోటోల్ని తీస్తూ చూసుకుంటూ ఉంటారు. ఎవరికి అయినా.. ఎలాంటి వారికి అయినా.. ఫోటో అనేది ఓ అందమైన జ్ఞాపకం. ఇక చిన్నప్పటి ఫోటోను ఎవరు చూసుకున్న మురిసిపోతారు. అరే మనం ఎంత మారపోయాం.. అప్పుడు ఇలా ఉన్నా.. ఇప్పుడు ఇలా అయిపోయాం అని రకరకాలుగా చర్చించుకుంటారు. ఇక్కడ షేర్ చేసిన ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నది ఓ ప్రముఖ వ్యక్తి. ఫోటోలో కాస్త తెల్లగా... చిన్నగా కుడివైపు ఉన్న చిన్నారి  ఓ సెలబ్రిటీ. చిన్నప్పటి నుంచే వ్యాపారంలో మెళుకువలో నేర్చుకొని..యంగేజ్‌లోనే బిజినెస్‌లో అడుగు పెట్టింది.

ఆమె ఎవరో కాదు.. మెగా ఇంటి కోడలు ఉపాసన కొణిదెల. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటి ఇల్లాలు. ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. ఉపాసన ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు. ఉపాసన తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని. అయితే ఉపాసనకు ఉపాసనకి నలుగురు అక్కా చెల్లెల్లున్నారు. వీరిలో ఉపాసన రెండోది. అక్క సింధూరి పుట్టినరోజు సందర్భంగా ఉపాసన తన అక్కతో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది.


ఇక ఉపాసన కామినేని వయసునుంచే వ్యాపారానికి సంబంధించిన మెళుకువలు నేర్చుకున్నారు. మెగా హీరో రామ్ చరణ్‌ను  ఉపసాన 14 June 2012 న పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. పేపర్లను, పుస్తకాలను చదవడం ఉపాసన అలవాటు. అంతే కాదు ఆమె “బి పాజిటివ్” అనే హెల్త్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా ఉన్నారు. రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన. ఆమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు అభిమానులతో తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు.

First published:

Tags: Ram Charan, Upasana konidela

ఉత్తమ కథలు