ఉపాసన ఒత్తిడిని తగ్గించేది ఎవరో తెలుసా...

Upasana Konidela : ఉపాసన కొణిదెల... రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

news18-telugu
Updated: September 15, 2019, 12:51 PM IST
ఉపాసన ఒత్తిడిని తగ్గించేది ఎవరో తెలుసా...
Instagram/upasanakaminenikonidela
  • Share this:
Upasana Konidela : ఉపాసన కొణిదెల... రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గిన ఉపాసన, మంచి ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతోంది. పేదలకు, అనాథ బాలలకు సాయం చేస్తూ మంచి మనసున్న మనిషిగానూ గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఆ మధ్య  ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సంగతి తెలిసిందే.
అది అలా ఉంటే ఉపాసన ఓ కుక్క పిల్లతో దిగిన కొన్ని ఫోటోస్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. డెక్స్టర్ (ఉపాసన పెంచుకుంటున్న కుక్క పిల్ల పేరు) నా ఒత్తిడిని తగ్గిస్తాడని.. ఎప్పుడైనా ఒత్తిడిగా ఫీల్ అయితే డెక్స్టర్‌ను హత్తుకుంటానని రాసుకుంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ కూడా డెక్స్టర్ చాలా అందంగా ఉన్నాడని.. సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading