Home /News /movies /

UPASANA KONIDELA PURCHASED NEW AUDI E TRON CAR DETAILS HERE SLB

Upasana: మెగా రేంజ్ తెలిసేలా కొత్త కారు కొనేసిన ఉపాసన.. ధర ఎంతో తెలుసా?

Photo Instagram

Photo Instagram

Upasana New Car: మెగా కోడలు, అపోలో చైర్ పర్సన్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొత్త కారు కొనేశారు. ఈ లగ్జరీ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తూ తన ఇన్స్‌‌స్టా పేజ్‌లో ఉపాసన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఇంకా చదవండి ...
మెగా కోడలు, అపోలో చైర్ పర్సన్, రామ్ చరణ్ సతీమణి (Ram Charan Wife) ఉపాసన (Upasana) కొత్త కారు (New Car) కొనేశారు. ఈ లగ్జరీ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తూ తన ఇన్స్‌‌స్టా పేజ్‌లో ఉపాసన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన, మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను నెటిజన్లతో పంచుకునే ఆమె.. తాజా వీడియోలో తన కారును పూర్తిగా చూపించారు. ఆడి ఈ ట్రాన్ అనే ఈ కారు ఎంతో సురక్షితమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. తన దృష్టిలో భవిష్యత్తు అంటే సుస్థిరతతో పాటు ప్రగతి శీలమైన లగ్జరీ కూడా కలిసి ఉంటుందని.. ఆడి ఇ-ట్రాన్‌(audi e tron) కారులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

ప్రగతి శీలంగా స్థిరమైన, విలాసవంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ఇదే ఆరంభం అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఆడి కారు ధర మాత్రం కోటి ఇరవై లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఉపాసన తీసుకున్న కారు చాలా లగ్జరీగా ఉందని, కలర్ అయితే సూపర్ అంటూ ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.


మెగా కోడలిగా కొణిదెల వారింట అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన. సామాజిక స్పృహతో ఆమె చేసే కార్యక్రమాలు పలువురి మన్ననలు పొందుతున్నాయి. సోషల్ సర్వీస్ చేస్తూనే మూగజీవాల పరిరక్షణ చేపట్టే ఆమె కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి సాయపడ్డారు. అలాగే బీ పాజిటివ్ అనే మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. సోషల్ మీడియా వేదికగా పలు ఆరోగ్య సంబంధిత సూచనలు ఇస్తుంటారు. మహిళా సాధికారత కోసం ఆమె కృషి చేస్తుంటారు.

ఇక ఉపసన భర్త రామ్ చరణ్ విషయానికొస్తే.. ఇటీవలే RRR సినిమాతో భారీ హిట్ అందుకొని ఆ తర్వాత ఆచార్య సినిమాతో కాస్త డీలా పడ్డారు. ప్రస్తుతం బడా దర్శకులు శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ మూడు విభిన్న పాత్రలతో అలరించబోతున్నారని సమాచారం. సర్వ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా చెర్రీ కెరీర్‌లో 15వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Audi, Mega Family, Ram Charan, Upasana kamineni, Upasana konidela

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు