చిరంజీవి కోడలు అయినందుకు గర్వంగా ఉంది.. ఉపాసన ట్వీట్..

తెలుగు ఇండస్ట్రీలో ఉపాసనకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా క్రేజ్ ఉంది.. అలాగే సొంత ఇమేజ్ కూడా సంపాదించుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2019, 3:57 PM IST
చిరంజీవి కోడలు అయినందుకు గర్వంగా ఉంది.. ఉపాసన ట్వీట్..
అత్తా మామ చిరంజీవి,సురేఖలతో రామ్ చరణ్ ఉపాసన (Twitter/Photo)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఉపాసనకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా క్రేజ్ ఉంది.. అలాగే సొంత ఇమేజ్ కూడా సంపాదించుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్. ఎంతగా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుందో అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపై కూడా చాలా యాక్టివ్‌గా స్పందిస్తుంటుంది ఉపాసన. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. దేశమంతా మాట్లాడుకునేలా చేసిన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం హత్య ఘటనతో దేశమంతా మనవైపు చూస్తుంది. ఈ షాద్‌నగర్ లైంగికదాడిపై అంతా సోసల్ మీడియాలో స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న ఉపాసన కూడా తన యూట్యూబ్ ఛానెల్ నుంచి ఓ వీడియోను విడదల చేసింది.
ఇక ఇప్పుడు తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి స్పందనను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మావయ్య పంపిన మెసేజ్ చూసిన తర్వాత.. ఆయన రియాక్షన్ గురించి చదివిన తర్వాత మెగా ఇంటి కోడలు అయినందుకు గర్వంగా ఉందంటూ చిరంజీవి తనకు పంపిన సందేశాన్ని పోస్ట్ చేసింది ఈ మెగా కోడలు. ఇది చూసి అభిమానులు కూడా హర్షిస్తున్నారు. ఈ నలుగురు నిందితులకు పడిన శిక్ష చూసి కామంతో కళ్లు మూసుకుపోయి నేరాలు ఘోరాలు చేసే వాళ్లకు కనువిప్పు కలగాల్సిందే అంటూ స్పందించాడు చిరు. ఈ మెసేజ్ కోడలే పోస్ట్ చేసింది. మొత్తానికి చిరు స్పందన కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>