ఉపాసన చేసిన పనికి యూట్యూబ్ ఘనసత్కారం...సంబరాలు చేసుకున్న రాంచరణ్, సమంత

ఉపాసన కామినేని కొణిదెల (Image: Instagram)

యూట్యూబ్ వేదికగా ఇప్పటికే ఉపాసన చానెల్ ఏకంగా లక్ష సబ్‌స్క్రయిబర్లను సొంతం చేసుకుంది. దీంతో యూట్యూబ్ టీమ్ ఉపాసనను ప్రత్యేకంగా అభినందిస్తూ సిల్వర్ ప్లగ్ మొమెంటోను బహూకరించింది.

  • Share this:
    రాంచరణ్ సతీమణి ఉపాసన అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్ వేదికగా ఇప్పటికే ఉపాసన చానెల్ ఏకంగా లక్ష సబ్‌స్క్రయిబర్లను సొంతం చేసుకుంది. దీంతో యూట్యూబ్ టీమ్ ఉపాసనను ప్రత్యేకంగా అభినందిస్తూ సిల్వర్ ప్లగ్ మొమెంటోను బహూకరించింది. ఉపాసన కొణిదెల అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవికి సంబందించిన ఏ అప్‌డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలుస్తోంది. అయితే ఉపాసన సాధించిన అరుదైన ఘనతను ఆమె సన్నిహితురాలు అక్కినేని సమంత అభినందలు తెలిపింది.
    First published: