హోమ్ /వార్తలు /సినిమా /

Upasana Konidela: రామ్ చరణ్ స్టైలిష్ లుక్.. ఉపాసన నాటీ కామెంట్స్

Upasana Konidela: రామ్ చరణ్ స్టైలిష్ లుక్.. ఉపాసన నాటీ కామెంట్స్

రామ్ చరణ్ ఉపాసన (File/Photo)

రామ్ చరణ్ ఉపాసన (File/Photo)

Ram Charan Stylish look: ప్రస్తుతం RC15 సినిమాతో ఎంతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. తాజాగా తన స్టైలిష్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏదో షూటింగ్ కోసం రెడీ అవుతున్నప్పటి పిక్ తన ఇన్స్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ పిక్ వైరల్ అయింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

RRR సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ (Ram Charan).. వరుస సినిమాలతో పాటు పలు యాడ్ షూట్స్ చేస్తూ బిజీ అయ్యారు. బడా డైరెక్టర్ శంకర్ (Shankar)తో చేయబోతున్న సినిమా కోసం డిఫరెంట్ లుక్ లోకి మారారు చెర్రీ. ప్రస్తుతం ఈ సినిమాతో ఎంతో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా తన స్టైలిష్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏదో షూటింగ్ కోసం రెడీ అవుతున్నప్పటి పిక్ తన ఇన్స్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ పిక్ వైరల్ అయింది. ఈ పిక్ చూసిన రామ్ చరణ్ సతీమణి, కొణిదెల కోడలు ఉపాసన (Upasana) నాటీ కామెంట్స్ చేసింది. తన భర్తపై ఆమె చేసిన కామెంట్ చూసి ఖుషీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్.

ఏదో క్యారెక్టర్ కోసం ముస్తాబవుతున్న పిక్ షేర్ చేశారు రామ్ చరణ్. దీనిపై వర్క్ మూడ్ అని ట్యాగ్ చేశారు. స్టైలిష్ గా తయారై అద్దంలో తన ముఖం చేసుకుంటున్నట్లుగా ఈ పిక్ ఉంది. ఆయన హెయిర్ స్టైల్, గెడ్డం లుక్ చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ పిక్ చూసిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. ఓ బేబీ అంటూ హార్ట్ సింబల్‌ పెడుతూ కామెంట్ వదిలింది. రామ్ చరణ్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం బడా దర్శకులు శంకర్ (Shankar) దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్ డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. తాజాగా వదిలిన ఈ పిక్ ఈ సినిమాకు చెందినదా? లేక ఏదైనా యాడ్ షూట్ కోసమా అనేది జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 50వ సినిమా కావడంతో దిల్ రాజు ఈ మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలక్షన్ కమీషనర్‌గా కనిపించనున్నారని సమాచారం. దీంతో మెగా అభిమానుల్లో ఆయన లుక్ ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ నెలకొంది. ఇంతలో ఈ పిక్ బయటకు రావడం మరింత అట్రాక్షన్ అయింది.

Published by:Sunil Boddula
First published:

Tags: Ram Charan, RC 15, Tollywood, Upasana konidela

ఉత్తమ కథలు