మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి (Ram Charan wife) ఉపాసన కామినేని (Upasana Kamineni) ఇంట్లో విషాదం నెలకొంది. ఉపాసన గ్రాండ్ మదర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన ఉపాసన.. ఆమె జ్ఞాపకాలతో ఎమోషనల్ అయింది. ఈ మేరకు తన నానమ్మతో కలిసి దిగిన పిక్స్ పంచుకుంది ఉపాసన.
''చివరి వరకు ఆమె ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో ఆమె ద్వారానే తెలుసుకున్నాను.. నన్ను పెంచింది ఆమెనే. నా గ్రాండ్ పేరెంట్స్‌తో నేను అందుకున్న ప్రేమానుభవాలను నా పిల్లలకు కూడా అందేలా చూస్తానని మాటిస్తున్నా'' అంటూ ఉపాసన ఎమోషనల్ మెసేజ్ పెట్టింది.
గత కొన్ని రోజులుగా ఉపాసనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ - ఉపాసన తల్లితండ్రులు కాబోతున్నారనే వార్తలు మెగా శిబిరాలను సంతోష పెట్టాయి. ఆమె ప్రెగ్నెంట్ అయినప్పడి నుంచి రామ్‌చరణ్ ఇంట్లో శుభాలు జరుగుతుండగా.. ఇప్పుడు ఉపాసన గ్రాండ్ మదర్ మృతి చెందడం కలవర పెడుతోంది.
View this post on Instagram
రామ్ చరణ్- ఉపాసన పెళ్లి జరిగి పదేళ్లు కావొస్తోంది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ పనులతో ఉపాసన బిజీగా ఉండగా.. రామ్ చరణ్ తన సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మెగా కోడలిగా కొణిదెల వారింట అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. సామాజిక స్పృహతో ఆమె చేసే కార్యక్రమాలు పలువురి మన్ననలు పొందుతున్నాయి. సోషల్ సర్వీస్ చేస్తూనే మూగజీవాల పరిరక్షణ చేపట్టే ఆమె కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి సాయపడ్డారు. అలాగే బీ పాజిటివ్ అనే మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. సోషల్ మీడియా వేదికగా పలు ఆరోగ్య సంబంధిత సూచనలు ఇస్తుంటారు. మహిళా సాధికారత కోసం ఆమె కృషి చేస్తుంటారు.
ఇకపోతే ఇటీవలే RRR రూపంలో సక్సెస్ అందుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చకచకా జరుగుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mega Family, Ram Charan, Upasana kamineni