news18-telugu
Updated: October 26, 2019, 2:16 PM IST
Instagram
Upasana Konidela : ఉపాసన కొణిదెల... రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ విస్తరణలో తనదైన పాత్ర పోషిస్తూ అదరగొడుతున్నారు. అంతేకాదు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన. రామ్ చరణ్‌తో పెళ్లి తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గిన ఉపాసన, మంచి ఫిట్నెస్ మెయిన్టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. దీనికి తోడు వీలున్నప్పుడల్లా.. పేదలకు, అనాథ బాలలకు సాయం చేస్తూ మంచి మనసున్న మనిషిగానూ గుర్తింపు పొందారు. తన సేవలకు గుర్తింపుగా.. ఆ మధ్య ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సంగతి తెలిసిందే.
అది అలా ఉంటే ఉపాసన తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో బాలీవుడ్ హీరోయిన్ కత్రీనాకు శుభాకాంక్షలు తెలిపారు. కత్రీనా ఈ మధ్య కాస్మోటిక్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. ఈ ప్రోడక్ట్స్‌కు ప్రచారం కలిగించే విషయంలో సౌత్ సూపర్ స్టార్ నయనతారను వాడుకుంది కత్రీనా.. దానికి సంబందించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో ఉపాసన తన అభినందలను తెలిపుతూ.. ఆ ప్రచార వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇలా తన వంతుగా తన ఫాలోవర్స్‌కు ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి తెలిసేలా కత్రీనాకు సహాయం చేసింది.
ఉపాసన అదిరిపోయే పిక్స్
Published by:
Suresh Rachamalla
First published:
October 26, 2019, 2:13 PM IST