Sonakshi Sinha : హీరోయిన్ సోనాక్షి సిన్హాపై 420 కేసు నమోదు చేసిన పోలీసులు...

Sonakshi Sinha : బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి షాకిచ్చారు. సోనాక్షి సిన్హా ప్రముఖ హిందీ సినిమా నటి మాత్రమే కాదు. బీజేపీ మాజీ ఎంపీ శతృఘ్న సిన్హా గారాల పట్టీ కూడా.

news18-telugu
Updated: July 12, 2019, 3:01 PM IST
Sonakshi Sinha : హీరోయిన్ సోనాక్షి సిన్హాపై 420 కేసు నమోదు చేసిన పోలీసులు...
సోనాక్షి సిన్హా... Photo: Instagram.com/aslisona/
  • Share this:
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి షాకిచ్చారు. సోనాక్షి సిన్హా ప్రముఖ హిందీ సినిమా నటి మాత్రమే కాదు. బీజేపీ మాజీ ఎంపీ శతృఘ్న సిన్హా గారాల పట్టీ కూడా. వివరాల్లోకి వెళితే.. సోనాక్షి 2018లో ఓ స్టేజి ప్రదర్శన ఇచ్చేందుకు రూ.24 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని..ఆ కార్యక్రమానికి రాలేదని..కార్యక్రమ నిర్వాహకులు యూపీలోని కట్‌ఘర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సినీనటి సోనాక్షిసిన్హాపై యూపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 406ల కింద కేసు నమోదు చేసి షాక్ ఇచ్చారు. అంతే కాదు ఈ ఛీటింగ్ కేసు విషయంలో దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఓ పోలీసు బృందం గురువారం సాయంత్రం ముంబైలోని సోనాక్షిసిన్హా నివాసంకు చేరుకుంది. అయితే పోలీసులు వచ్చినపుడు సోనాక్షిసిన్హా అందుబాటులో లేదు.

సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు సోనాక్షి తల్లి యూపీలో సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. సోనాక్షిసిన్హా.. గత ఎన్నికల్లో తల్లి తరపున ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. సోనాక్షి ప్రస్తుతం.. అక్షయ్ కుమార్ సరసన 'మిషన్ మంగళ్'.. సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3' సినిమాలు చేస్తోంది.

మతిపోగొడుతోన్న సోనాక్షి సిన్హా... అదిరిపోయిన లేటెస్ట్ ఫోటో షూట్..


Published by: Suresh Rachamalla
First published: July 12, 2019, 11:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading