Home /News /movies /

UNSTOPPABLE WITH NBK SEASON FINALE WITH SUPERSTAR MAHESH BABU PROMO GOES VIRAL PREMIERES FEBRUARY 4 IN AHA SR

Balakrishna | Mahesh Babu : గుండెల్నీ పిండేసిన మహేష్ స్టోరీ.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ప్రోమో..

Balakrishna Mahesh Babu Photo : Twitter

Balakrishna Mahesh Babu Photo : Twitter

Unstoppable with NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉంటూనే ఇంకోవైపు ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

    Unstoppable with NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉంటూనే ఇంకోవైపు ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది. రీసెంట్‌గా  ఈ టాక్ షో   దేశంలోనే ఈ షో IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో 9.7 రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది. ఇక అది అలా ఉంటే మహేష్ బాబు చేసిన ఎపిసోడ్‌ ఎప్పుడు ప్రసారం కానుందో తెలిపింది ఆహా.. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ప్రసారం కానున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. ఇక మరోవైపు దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేసిందీ ఆహా టీమ్. బాలకృష్ణ మహేష్‌ల మధ్య సరదా సంభాషణలతో సాగుతోంది. ఈ సందర్భంగా మహేష్ కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌ వెళ్తే పాము కనిపించదని, అప్పటి నుంచి మళ్లీ అటు వైపు వెళ్లలేదని పంచుకున్నారు. ఇక మరోవైపు ఆయన చేసిన సామాజిక సేవల గురించి కూడా ప్రోమోలో చూపించారు. ఈ సందర్భంగా మహేష్ (Mahesh Babu) తన కొడుకు గురించి ప్రస్తావించారు. గౌతమ్ ఆరు నెలల ముందే జన్మించారని.. దీంతో తన దగ్గర డబ్బు ఉండడంతో కాపాడుకున్నామని.. డబ్బు లేని వాళ్ల పరిస్థితి ఏంటని అన్నారు. దీంతో అప్పటినుంచి చిన్నారుల గుండె ఆపరేషన్‌ కోసం తన వంతుగా సాయం చేస్తున్నాని తెలిపారు. అంతేకాదు తన టైమింగ్, పంచుల విషయాన్ని ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఈ ఎపిసోడ్‌తో  బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో (Unstoppable with NBK)ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ విషయాన్ని ఆహా వాళ్లు అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ, మహేష్ బాబు ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ఆహా ఓటిటిలో వస్తున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య వ్యాఖ్యాత అన్నపుడే ఈ షో సూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన హోస్టింగ్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఆహా.. బాలయ్య ఏం చేస్తున్నాడ్రా బాబూ అంటూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా బాలయ్య తనను తాను మార్చుకున్న తీరుకు సలామ్ కొడుతున్నారు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు.


    తన స్టార్ డమ్ కూడా పక్కనబెట్టి వచ్చిన గెస్టులతో బాలయ్య వ్యవహరిస్తున్న తీరు అదిరిపోతుంది. తన కంటే ఇమేజ్‌లో ఎంతో చిన్నవాడైనా నానిని మొన్న బాలయ్య చూసుకున్న విధానం.. అతడిని పొగిడిన స్టైల్ చూసి పడిపోయారంతా. ఎపిసోడ్ ఎపిసోడ్‌కు బాలయ్య ఇంకా మెరుగవుతున్నాడు. పైగా గెస్టులు కూడా చాలా మంది వస్తున్నారు. ఇక రవితేజ ఎపిసోడ్‌లో కూడా మాస్ రాజాను బాగానే రిసీవ్ చేసుకున్నారు నట సింహాం. ఇప్పటికే మోహన్ బాబు, బ్రహ్మానందం, నాని, అనిల్ రావిపూడి, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, థమన్, బోయపాటి శ్రీను వచ్చారు. ఆ తర్వాత ఎసిపోడ్‌లో కోడూరు బ్రదర్స్.. రాజమౌళి, కీరవాణి ఎపిసోడ్ ఓ రేంజ్‌లో అదిరిపోయింది.

    Rashmika Mandanna : రష్మిక మందన్న హాట్ షో.. తగ్గేదేలే.. మరోసారి అదరగొట్టిన శ్రీవల్లి..

    ఓ వైపు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు వచ్చిన మహేష్ బాబు.. ఇప్పుడు బాబాయ్ (Unstoppable with NBK) బాలయ్య షోకు వచ్చాడు. ఈ ఎపిసోడ్‌లో మహేష్ బాబు తన కెరీర్‌కు సంబంధించిన ముచ్చట్లతో పాటు ఇంకా చాలా విషయాలు చర్చించాడని తెలుస్తుంది. ఇక ఫస్ట్ సీజన్ పూర్తవ్వడంతో.. రెండో సీజన్ ఎపుడు మొదలవుతుందా అని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా బాలయ్య తన కెరీర్‌లో ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో పాటు ‘ఆహా’ టాక్ షోతో నిజంగా ప్రేక్షకులు ఆహా అనుకునేలా చేస్తున్నారు. బాలయ్య అఖండ ప్రస్తుతం హాట్ స్టార్‌లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో మరోసారి ఆ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Balakrishna, Mahesh Babu, Tollywood news, Unstoppable with NBK

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు