హోమ్ /వార్తలు /సినిమా /

Unstoppable With NBK : మరికొన్ని గంటల్లో మహేష్ బాబుతో బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో.. హైలెట్స్ ఇవే..

Unstoppable With NBK : మరికొన్ని గంటల్లో మహేష్ బాబుతో బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో.. హైలెట్స్ ఇవే..

Unstoppable With NBK : ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా బాలయ్య తన యాటిట్యూడ్‌కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది. తాజాగా మహేష్ బాబు ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్‌ విత్ NBK ఫస్ట్ సీజన్ ముగయనుంది.

Unstoppable With NBK : ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా బాలయ్య తన యాటిట్యూడ్‌కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది. తాజాగా మహేష్ బాబు ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్‌ విత్ NBK ఫస్ట్ సీజన్ ముగయనుంది.

Unstoppable With NBK : ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా బాలయ్య తన యాటిట్యూడ్‌కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది. తాజాగా మహేష్ బాబు ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్‌ విత్ NBK ఫస్ట్ సీజన్ ముగయనుంది.

ఇంకా చదవండి ...

  Unstoppable with NBK : ప్రెజెంట్  బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. ఇంకోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా బాలయ్య తన యాటిట్యూడ్‌కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది. రీసెంట్‌గా  ఈ టాక్ షో   దేశంలోనే ఈ షో IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో 9.7 రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ షోలో ప్రతీ వారం ఎవరు గెస్ట్‌గా వస్తారనే విషయం సామాన్యులతో పాటు సెలబ్రిటీలలో కూడా నెలకొంది.

  రీసెంట్‌గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  కూడా బాలయ్య టాక్‌ షోలో నాకు పాల్గొనాలని ఉంది. ఆయన హోస్ట్‌కు నేను ఫిదా అయ్యాను అంటూ ఓపెన్‌ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాదు.. బాలకృష్ణ తొలిసారి చేస్తోన్న ఈ టాక్ షోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు.. ఈ షోతో ఆహా ఓటీటీకి ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ..తనను తాను మార్చుకున్న విధానం చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వారం ఎపిసోడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్‌గా రానున్నారు.

  Chiranjeevi : జగదేకవీరుడు అతిలోకసుందరి కంటే ముందు చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో ఆగిపోయిన ఈ మూవీ గురించి తెలుసా..

  ఈ ఎపిసోడ్ ఈ రోజు రాత్రి 8.00 గంటలకు ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన రెండు ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ ఎపిపోడ్‌లో మహేష్ బాబు, బాలయ్య మధ్య ఆసక్తికర సంభాషణ హైలెట్‌గా కానుంది. ఇంత యంగ్‌గా ఉన్నావేంట‌య్యా బాబు.. కానీ నాదో చిన్న కోరిక నా డైలాగ్ నీ గొంతులో వినాల‌నుంద‌య్యా అంటూ బాలకృష్ణ మ‌హేష్‌ను అడగడంతో మహేష్ రిప్లే ఇస్తూ.. మీ డైలాగ్ మీరు త‌ప్ప ఇంకెవ‌రు చెప్పలేరు సార్‌.. అనడంతో నేను చెప్పను అనే సమాధానాన్ని ఎంతో తెలివిగా చెప్పడం ఆకట్టుకుంది.

  Balakrishna Mahesh Babu Episode,Balakrishna Mahesh Babu Unstoppable Episode,mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu unstoppable episode dec 17th,mahesh babu in unstoppable,unstoppable with nbk,mahesh babu in blakrishna show,unstoppable promo,balakrishna talk show,unstoppable mahesh babu promo,balakrishna unstoppable show,balakrishna unstoppable,mahesh babu in unstoppable with nbk,nandamuri balakrishna,unstoppable with mohan babu,మహేష్ బాబు,మహేష్ బాబు అన్‌స్టాపబుల్ డిసెంబర్ 17,బాలకృష్ణ అన్‌స్టాపబుల్ డిసెంబర్ 17,బాలకృష్ణ మహేష్ బాబు ఎపిసోడ్,బాలకృష్ణ మహేష్ బాబు అన్‌స్టాపబుల్ టాక్ షో
  బాలకృష్ణ, మహేష్ బాబు (Balakrishna Mahesh Babu Photo : Twitter)

  ఇంకా బాలయ్య మహేష్‌ను ఉద్దేశిస్తూ.. చిన్న‌పుడు నువ్వు చాలా నాటీ కిడ్‌వ‌ని విన్నాను. చేసేవ‌న్నీ చేస్తావ్‌.. చెప్పమంటే సిగ్గ‌ప‌డ‌తావ్‌.. నంబ‌ర్ వ‌న్ స్టార్ అవుతూ సూప‌ర్ స్టార్ అయిపోయావ్‌. స‌డెన్‌గా మూడేళ్లు గ్యాప్ తీసుకున్నావ్‌.. ఏంట‌ని అడుగటం బాల‌కృష్ణ. అయితే ఆ ప్రశ్నకు సమాధానంగా మహేష్.. ఆ మూడేళ్లు నేను క‌రెక్ట్ చేసుకోవ‌డానికి.. ఇక ఆ తర్వాత నుంచి మ‌ళ్లీ తిరిగి ఆలోచించలేదని చెప్పారు. మరో సందర్భంలో వెకేష‌న్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్.. అంటూ ఆసక్తికరంగా సాగనుంది.   మరోవైపు ఓ సారి కేబీఆర్‌ పార్క్‌లో రన్నింగ్ చేస్తుంటే.. ఓ చోట పాము కనపడితే.. రివర్స్‌లో 5 కిలోమీటర్లు రన్ చేసుకొని వేరే గేటు కుండా వెళ్లిపోయాను. అప్పటి నుంచి కేబీఆర్ పార్క్ వైపు చూస్తే ఒట్టు అంటూ తనకు పాము వల్ల జరిగిన ఇన్సిడెంట్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

  Vekantesh Remakes : వెంకటేష్ దూకుడు మాములుగా లేదుగా.. మరో సూపర్ హిట్ రీమేక్‌లో వెంకీమామ..


  ఈ ఎపిసోడ్‌తో  బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో (Unstoppable with NBK)ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ విషయాన్ని ఆహా వాళ్లు అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ, మహేష్ బాబు ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ఆహా ఓటిటిలో వస్తున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య వ్యాఖ్యాత అన్నపుడే ఈ షో సూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన హోస్టింగ్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఆహా.. బాలయ్య ఏం చేస్తున్నాడ్రా బాబూ అంటూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా బాలయ్య తనను తాను మార్చుకున్న తీరుకు సలామ్ కొడుతున్నారు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు.

  mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu unstoppable episode dec 17th,mahesh babu in unstoppable,unstoppable with nbk,mahesh babu in blakrishna show,unstoppable promo,balakrishna talk show,unstoppable mahesh babu promo,balakrishna unstoppable show,balakrishna unstoppable,mahesh babu in unstoppable with nbk,nandamuri balakrishna,unstoppable with mohan babu,మహేష్ బాబు,మహేష్ బాబు అన్‌స్టాపబుల్ డిసెంబర్ 17,బాలకృష్ణ అన్‌స్టాపబుల్ డిసెంబర్ 17
  బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోలో మహేష్ బాబు (Twitter/Photo)

  ఇప్పటికే మోహన్ బాబుతో మొదలైన ‘అన్‌స్టాపబుల్ టాక్ షో’ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మిలతో కలిపి తొమ్మిది ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.  మహేష్ బాబు ఎపిసోడ్‌తో  కలిపి 10 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. గత వారం మాత్రం తొమ్మిది ఎపిసోడ్స్‌తో కలిసి స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసారు. ఈ వారంతో ఆహాలో బాలయ్య అన్‌స్టాపుబుల్‌ సీజన్ 1కు ముగింపు పలకనున్నారు. మరి సెకండ్ సీజన్ ఎపుడు మొదలవుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  First published:

  Tags: Balakrishna, Mahesh Babu, Tollywood, Unstoppable with NBK

  ఉత్తమ కథలు