హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna | Mahesh Babu : వెకేష‌న్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్.. మహేష్ సీక్రెట్ బయటపెట్టిన బాలయ్య... వీడియో వైరల్..

Balakrishna | Mahesh Babu : వెకేష‌న్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్.. మహేష్ సీక్రెట్ బయటపెట్టిన బాలయ్య... వీడియో వైరల్..

Unstoppable with NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉంటూనే ఇంకోవైపు ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Unstoppable with NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉంటూనే ఇంకోవైపు ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Unstoppable with NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉంటూనే ఇంకోవైపు ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  Unstoppable with NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉంటూనే ఇంకోవైపు ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది. రీసెంట్‌గా  ఈ టాక్ షో   దేశంలోనే ఈ షో IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో 9.7 రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది. ఇక అది అలా ఉంటే మహేష్ బాబు చేసిన ఎపిసోడ్‌ ఎప్పుడు ప్రసారం కానుందో తెలిపింది ఆహా.. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ప్రసారం కానున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. ఇక మరోవైపు దీనికి సంబంధించిన మరో ప్రోమో విడుదల చేసిందీ ఆహా. బాలకృష్ణ మహేష్‌ల మధ్య సరదా సంభాషణలతో సాగుతోంది. ఇంత యంగ్‌గా ఉన్నావేంట‌య్యా బాబు.. కానీ నాదో చిన్న కోరిక నా డైలాగ్ నీ గొంతులో వినాల‌నుంద‌య్యా అంటూ బాలకృష్ణ మ‌హేష్‌ను అడగడంతో మహేష్ రిప్లే ఇస్తూ.. మీ డైలాగ్ మీరు త‌ప్ప ఇంకెవ‌రు చెప్పలేరు సార్‌.. అనడం ఆకట్టుకుంటోంది. ఇంకా బాలయ్య మహేష్‌ను ఉద్దేశిస్తూ.. చిన్న‌పుడు నువ్వు చాలా నాటీ కిడ్‌వ‌ని విన్నాను. చేసేవ‌న్నీ చేస్తావ్‌.. చెప్పమంటే సిగ్గ‌ప‌డ‌తావ్‌.. నంబ‌ర్ వ‌న్ స్టార్ అవుతూ సూప‌ర్ స్టార్ అయిపోయావ్‌. స‌డెన్‌గా మూడేళ్లు గ్యాప్ తీసుకున్నావ్‌.. ఏంట‌ని అడుగుతారు బాల‌కృష్ణ. అయితే ఆ ప్రశ్నకు సమాధానంగా మహేష్.. ఆ మూడేళ్లు నేను క‌రెక్ట్ చేసుకోవ‌డానికి.. ఇక ఆ తర్వాత నుంచి మ‌ళ్లీ తిరిగి ఆలోచించలేదని చెప్పారు. మరో సందర్భంలో వెకేష‌న్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్.. ఏంటి అంత సీక్రెట్.. అంటూ అనడంతో ప్రోమో ముగుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4 శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది.

  ఈ ఎపిసోడ్‌తో  బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో (Unstoppable with NBK)ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ విషయాన్ని ఆహా వాళ్లు అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ, మహేష్ బాబు ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ఆహా ఓటిటిలో వస్తున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య వ్యాఖ్యాత అన్నపుడే ఈ షో సూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన హోస్టింగ్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఆహా.. బాలయ్య ఏం చేస్తున్నాడ్రా బాబూ అంటూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా బాలయ్య తనను తాను మార్చుకున్న తీరుకు సలామ్ కొడుతున్నారు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు.

  తన స్టార్ డమ్ కూడా పక్కనబెట్టి వచ్చిన గెస్టులతో బాలయ్య వ్యవహరిస్తున్న తీరు అదిరిపోతుంది. తన కంటే ఇమేజ్‌లో ఎంతో చిన్నవాడైనా నానిని మొన్న బాలయ్య చూసుకున్న విధానం.. అతడిని పొగిడిన స్టైల్ చూసి పడిపోయారంతా. ఎపిసోడ్ ఎపిసోడ్‌కు బాలయ్య ఇంకా మెరుగవుతున్నాడు. పైగా గెస్టులు కూడా చాలా మంది వస్తున్నారు. ఇక రవితేజ ఎపిసోడ్‌లో కూడా మాస్ రాజాను బాగానే రిసీవ్ చేసుకున్నారు నట సింహాం. ఇప్పటికే మోహన్ బాబు, బ్రహ్మానందం, నాని, అనిల్ రావిపూడి, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, థమన్, బోయపాటి శ్రీను వచ్చారు. ఆ తర్వాత ఎసిపోడ్‌లో కోడూరు బ్రదర్స్.. రాజమౌళి, కీరవాణి ఎపిసోడ్ ఓ రేంజ్‌లో అదిరిపోయింది.

  Actress Pragathi: ఆ హీరో తనతో గడపమన్నాడు.. నటి ప్రగతి సంచలన కామెంట్స్..

  ఇక ఫస్ట్ సీజన్ పూర్తవ్వడంతో.. రెండో సీజన్ ఎపుడు మొదలవుతుందా అని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా బాలయ్య తన కెరీర్‌లో ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో పాటు ‘ఆహా’ టాక్ షోతో నిజంగా ప్రేక్షకులు ఆహా అనుకునేలా చేస్తున్నారు. బాలయ్య అఖండ ప్రస్తుతం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Balakrishna, Mahesh Babu, Unstoppable with NBK

  ఉత్తమ కథలు