Unstoppable With NBK S2 - Promo 6 | చూడు ఓవైపు చూడు.. అంటూ బాలయ్య సినిమాలో చెప్పినట్టు అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణలోని మరో కోణం ప్రేక్షకులకు తెలిసొచ్చింది. ఈ షోలో ఎంతో ఈజ్‌తో చేసి హోస్ట్‌గా కెవ్వు కేక పుట్టించారు. రీసెంట్‌గా అన్‌స్టాపబుల్ సీజన్ 2 స్టార్ట్ అయింది. నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటు రాజకీయాలతో పాటు.. అటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా మారారు. అయితే ఈ క్రమంలో బాలయ్య ఓటీటీలోకి వచ్చి అందర్నీ షాక్ ఇచ్చారు. బాలయ్య చేస్తున్న ప్రముఖ ఓటీటీ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ షో సెకండ్ సీజన్లో 5 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా ఆరో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.ఈ ఎపిసోడ్‌లో ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన జయ ద్వయంగా పేరు గాంచిన జయప్రద, జయసుధ ఈ షోలో సందడి చేయనున్నారు.
మధ్యలో యువ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఈ షోలో మెరవనుంది. బాలయ్య సినిమా నారీ నారీ నడుమ మురారి’ తరహాలో ఈ ముగ్గురు హీరోయిన్స్‌తో చేసే అల్లరి ఏ విధంగా ఉండబోతుందో ప్రోమోలో చూపించారు. ముఖ్యంగా జయప్రద.. ఈ నలుగురు హీరోల్లో ఎవరితో చేయడం ఇష్టం అంటూ కాస్త ఆట పట్టించారు బాలయ్య. అటు రాశీ ఖన్నాపై సెటైర్లు వేసారు.
ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలంటే కొన్ని కాంప్రమైజెస్ తప్పవా అని బాలయ్య ప్రశ్న అడిగారు. ఇక ఉమెన్ సెంట్రిక్ మూవీస్‌కు డబ్బులు పెట్టడానికి నిర్మాతలు వందసార్లు ఆలోచిస్తారు.. ఇది నిజమా... అబద్దమా.. అంటూ అడిగిన ప్రశ్నలు ఈ షో ఎంత బోల్డ్‌గా ఉండబోతుందో చూపెట్టారు. మొత్తంగా ముగ్గురు భామలతో బాలయ్య చేసిన ఈ అల్లరి 23వ తేదిన ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
Evergreen Beauties tho #NBK allari????#UnstoppableWithNBKS2 - Ep 6 Promo out now.???? ▶️https://t.co/AkJAT03cVk#NBKOnAHA #Jayasudha @realjayaprada #RaashiKhanna #MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india pic.twitter.com/gCmFl0hS85
— ahavideoin (@ahavideoIN) December 21, 2022
అన్‌స్టాపబుల్ సీజన్ 1లో అంతా సినిమా తారలే వస్తే.. సెకండ్ సీజన్‌లో మాత్రం కాస్త వెరైటీగా సినీ నటులతో పాటు రాజకీయ నేతలను కూడా ఈ షోకు గెస్ట్‌లుగా పిలుస్తున్నారు. ఈ సీజన్2లో తొలి ఎపిసోడ్‌లో ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు కమ్ బాలయ్య అల్లుడు లోకేష్ ముఖ్య అతిథులగా హాజరై సందడి చేశారు. రెండో ఎపిసోడ్‌లో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వంటి యువ నటులతో సందడి చేశారు.
మూడో ఎపిసోడ్‌లో అడవి శేష్, శర్వానంద్ గెస్ట్‌లుగా సందడి చేశారు. నాల్గో ఎపిపోడ్‌లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధికలు సందడిచేస్తే.. ఐదో ఎపిసోడ్లో ఏకంగా అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డిలు వచ్చారు. ఆరో ఎపిపోడ్‌లో సీనియర్ హీరోయిన్స్ జయప్రద, జయసుధ సందడి చేయనున్నారు. ఏడో ఎపిపోడ్‌లో ప్రభాస్, గోపీచంద్ రానున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, క్రిష్‌లతో ఎపిసోడ్ ఉండనుంది. అటు వీరసింహారెడ్డి టీమ్ ఓ ఎపిసోడ్‌లో సందడి చేయనుంది. మొత్తంగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Jaya Prada, Jayasudha, Raashi Khanna, Unstoppable With NBK S2