హోమ్ /వార్తలు /సినిమా /

Unstoppable 2 - NBK - PSPK: బాలయ్య, పవన్ కళ్యాాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమోకు ముహూర్తం ఫిక్స్..

Unstoppable 2 - NBK - PSPK: బాలయ్య, పవన్ కళ్యాాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమోకు ముహూర్తం ఫిక్స్..

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ షో ప్రోమో   (File/Photo)

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ షో ప్రోమో (File/Photo)

Unstoppable 2 - NBK - PSPK: నందమూరి, మెగాభినులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్ ప్రోమోకు ముహూర్తం ఫిక్స్ అయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Unstoppable 2 - NBK - PSPK: నందమూరి, మెగాభినులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. నందమూరి నట సింహా బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. టాలీవుడ్‌లో నందమూరి, మెగా ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ చేస్తోన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక వేదికపై కనిపించడంపై ఇరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఆహా వేదికగా బాలయ్య అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.  అన్ స్టాపబుల్ షో టాప్ రేంజ్ కు వెళ్లింది.  ఈ షోలో క్రిష్‌తో పాటు సాయి ధరమ్ తేజ్‌తో పాటు మోక్షజ్ఞ సడెన్ ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర ప్రశ్నలు వేసినట్టు సమాచారం.

తాజాగా పవన్ కళ్యాణ్‌తో బాయ్య షో ఎపుడో పూర్తైయింది. కానీ ఎపుడు ప్రసారం చేస్తారనేది మాత్రం చెప్పలేదు. ఇక సంక్రాంతి కానుకగా పవన్ కళ్యాణ్‌తో బాలయ్యఎపిసోడ్‌‌కు సంబంధించిన ప్రోమోను ఆదివారం పండగ రోజున ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు అఫీసియల్‌గా ప్రకటించారు.

ఇక షోలో బాలయ్య పవన్ ‌తో సినిమా, రాజకీయాలతో పాటు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ గురించి ఈ షోలో మాట్లాడినట్టు సమాచారం. అంతేకాదు అకిరానందన్ సినీ ఎంట్రీపై చర్చించినట్టు సమాచారం.అకిరానందన్ సినీ ఎంట్రీపై బాలయ్య మాట్లాడుతూ.. అకిరానందన్ సినీ ఎంట్రీ పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాను రీమేక్ చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటుందని చెబుతున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ కూడా బాలయ్య అడిగిన ప్రశ్నలకు అంతే ఆసక్తిగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం.నందమూరి నట సింహా బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.

టాలీవుడ్‌లో నందమూరి, మెగా ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ చేస్తోన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక వేదికపై కనిపించడంపై ఇరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థులు తన మూడు పెళ్లిళ్ల ఇష్యూతో పాటు రాజకీయంగా ప్రజారాజ్యం.. ఈ తర్వాత జనసేన పార్టీని ఎందుకు స్థాపించాల్సి వచ్చిందనే విషయం ఇందులో హైలెట్‌గా నిలవనున్నట్టు సమాచారం.

ఇక ప్రజా రాజ్యం పార్టీ స్థాపించినపుడు యువ రాజ్యం అధినేతగా పవన్ కల్యాణ్ అప్పటి కాంగ్రెస్ నేతలను పంచ లూడదూసి కొడతారన్న చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ ఇష్యూపై బాలయ్య క్వశ్చన్ అడిగినట్టు సమాచారం. ఈ షోలో బాలయ్యను పవన్ కళ్యాణ్.. బాలయ్య గారు అని సంభోదించినట్టు సమాచారం. మరోవైపు బాలయ్య.. పవన్‌ను భయ్యా అంటూ పిలవడం ఈ షోలో హైలెట్ అని చెప్పొచ్చు.ఇంకోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాలకు సంబంధించిన విషయాలనే ఎక్కువగా ప్రస్తావించినట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ ను ఎందుకు ఎక్కువగా టార్గెట్ చేసినట్టు ఈ షోలో బాలయ్య ఆసక్తికర ప్రశ్న వేసినట్టు సమాచారం.

మొత్తంగా బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌లో ఇవే హైలెట్‌గా నిలవున్నాయా లేదా అనేది ప్రోమో విడుదల తర్వాత తెలుస్తోంది. ఇక బాలయ్య విషయానికొస్తే.. ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

First published:

Tags: Aha OTT, Balakrishna, NBK, Pawan kalyan, PSPK, Tollywood, Unstoppable With NBK S2

ఉత్తమ కథలు