ఆపరేషన్ తర్వాత ఇంటికి చేరుకున్న లోక నాయకుడు కమల్ హాసన్..

2016‘శభాష్ నాయుడు’ షూటింగ్ సమయంలో తీవ్ర గాయపడ్డ కమల్ హాసన్‌.. ఆ తర్వాత ఆస్పత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే కదా. తాజాగా డాక్టర్లు ఈ నెల 22న కమల్ హాసన్‌కు ఆపరేషన్ నిర్వహించి ఆ కాలులో అమర్చిన రాడ్‌ను శస్త్ర చికిత్స ద్వారా తొలిగించారు.

news18-telugu
Updated: November 28, 2019, 1:16 PM IST
ఆపరేషన్ తర్వాత ఇంటికి చేరుకున్న లోక నాయకుడు కమల్ హాసన్..
కమల్ హాసన్ డిశ్చార్జ్ (Twitter/Photo)
  • Share this:
2016‘శభాష్ నాయుడు’ షూటింగ్ సమయంలో తీవ్ర గాయపడ్డ కమల్ హాసన్‌.. ఆ తర్వాత ఆస్పత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే కదా. డాక్టర్లు.. కమల్ కాలుకు ఆపరేషన్ చేసి లోపల సపోర్ట్ కోసం ఒక రాడ్ అమర్చారు. తాజాగా డాక్టర్లు ఈ నెల 22న కమల్ హాసన్‌కు ఆపరేషన్ నిర్వహించి ఆ కాలులో అమర్చిన రాడ్‌ను శస్త్ర చికిత్స ద్వారా తొలిగించారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో కమల్ హాసన్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసారు. అంతేకాదు ఒక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని  కమల్ హాసన్‌కు డాక్టర్లు సూచించారు. రెస్ట్ తర్వాత కమల్ హాసన్.. శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఐతే.. కమల్ హాసన్‌కు ఈ ఆపరేషన్ ఎపుడో చేయించుకోవాల్సింది. వరుసగా సినిమాలు, టీవీ షోలు, రాజకీయాలతో బిజీగా ఉండటంతో లేట్ అయింది. రీసెంట్‌గా కమల్ హాసన్.. నటుడిగా 60 వసంతాలు పూర్తి చేసుకున్న  సంగతి తెలిసిందే కదా.

First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>